హిందీనాట మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణే. పెళ్ళికి ముందు ఈ ఇద్దరూ కలసి ‘గోలీయోంకీ రాస్ లీల రామ్‌లీల’, ‘బాజీరావ్ మస్తాని’, ‘పద్మావత్’ వంటి చిత్రాల్లో నటించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ మూడు చిత్రాల్లో కూడా కథానాయకుడి పాత్రగాని, నాయిక పాత్ర గాని లేదా రెండు పాత్రలు గాని చనిపోవడం జరుగుతుంది. అయితే, విషాదాంతంతో ముగిసినప్పటికీ ఈ మూడు చిత్రాలు కూడా ఈ జోడీకి ఘన విజయాలను అందించాయి. ఒక విధంగా ఆ యా సినిమాలతోనే నిజ జీవితంలో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే… పెళ్లి తర్వాత తొలిసారి ఈ ఇద్దరూ కలసి ‘83’ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. అంతేకాదు… ఈ సారి భార్యాభర్తల పాత్రల్లో సందడి చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… లెజెండరీ ఇండియన్ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా ‘83’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కపిల్ పాత్రలో రణ్‌వీర్ కనిపించనుండగా… కపిల్ సతీమణి రోమియో భాటియా పాత్రలో రణ్‌వీర్ బెటర్ హాఫ్ దీపిక పదుకొణే దర్శనమివ్వబోతోంది. కపిల్ బయోపిక్ ‘83’ అంటే హ్యాపీ అండ్ పాజిటివ్ ఎండింగ్. మరి… ఇంతవరకు నెగటివ్ ఎండింగ్ మూవీస్‌తో అలరించిన ఈ జంట… హ్యాపీ ఎండింగ్ మూవీతోనూ ఘనవిజయం అందుకుంటుందేమో చూడాలి.
[youtube_video videoid=C2PWbHDCDxE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: