2019 సెకండాఫ్‌లోనూ స్టార్స్ సంద‌డి

2019 Latest Telugu Movie News, 2019 Telugu Movies Release Dates, 2019 Upcoming Tollywood Films Release Dates, Telugu Film Updtaes, Telugu Filmnagar, Tollywood Cinema News, Tollywood Star Heroes Hungama in 2019, Tollywood Star Heroes Hungama in 2019 Second Half, Tollywood Star Heroes Movies in 2019
Tollywood Star Heroes Hungama in 2019 Second Half

ఫ‌లితాల సంగ‌తి ప‌క్క‌న పెడితే… ఈ ఏడాది ప్ర‌థ‌మార్ధంలో ఐదు అగ్ర క‌థానాయ‌కుల చిత్రాలు సంద‌డి చేశాయి. జ‌న‌వ‌రిలో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `య‌న్టీఆర్ క‌థానాయ‌కుడు`, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `విన‌య విధేయ రామ‌`, విక్ట‌రీ వెంక‌టేష్ `ఎఫ్ 2` విడుద‌ల కాగా… ఫిబ్ర‌వ‌రిలో బాల‌య్య `య‌న్టీఆర్ మ‌హానాయ‌కుడు` రిలీజైంది. ఇక మే నెల‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన `మ‌హ‌ర్షి` ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రాల‌న్నీ ఆ యా క‌థానాయ‌కుల అభిమానుల‌ను అల‌రించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేప‌థ్యంలో… ఈ ఏడాది ద్వితీయార్ధంలోనూ మ‌రికొంత‌మంది అగ్ర క‌థానాయ‌కులు త‌మ కొత్త చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌నున్నారు. `బాహుబ‌లి` సిరీస్ త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన `సాహో` ఆగ‌స్టు 15న విడుద‌ల కానుండ‌గా… అదే నెల‌లో కింగ్ నాగార్జున కొత్త చిత్రం `మ‌న్మ‌థుడు 2` రిలీజ్ కానుంద‌ని స‌మాచారం. ఇక సెప్టెంబ‌ర్‌లో వెంకీ తాజా చిత్రం `వెంకీ మామ‌` థియేట‌ర్ల‌లోకి రానుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న `సైరా న‌ర‌సింహారెడ్డి` అక్టోబ‌ర్ 2న రానుంద‌ని స‌మాచారం. అదే విధంగా మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ న‌టించిన `డిస్కో రాజా` కూడా అక్టోబ‌ర్ నెల‌లో రాబోతోంద‌ని తెలుస్తోంది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ కూడా ఏడాది చివ‌రలో రావ‌చ్చంటున్నారు. సో… 2019 ఫ‌స్టాఫ్ కంటే మిన్న‌గా 2019 సెకండాఫ్ స్టార్ హీరోల చిత్రాల‌తో క‌ల‌ర్‌ఫుల్‌గా ఉండ‌నుంద‌న్న‌మాట‌. ఈ చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాల‌ని కోరుకుందాం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =