ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ సుజీత్, UV క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన సూపర్ హిట్ మూవీ రన్ రాజా రన్ తో రైటర్, డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. టాలీవుడ్ కు ఎంటరవక ముందు 38 షార్ట్ ఫిలిమ్స్ కు దర్శకత్వం వహించారు. 23 సంవత్సరాలకే డైరెక్టర్ గా మారి సుజీత్ రికార్డ్ క్రియేట్ చేశారు. UV క్రియేషన్స్ , T-సిరీస్ బ్యానర్స్ పై 300కోట్ల బడ్జెట్ తో, భారీ తారాగణం తో, తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న సాహో మూవీ ని ఇప్పటివరకు ఒక మూవీ కి దర్శకత్వం వహించిన సుజీత్ హ్యాండిల్ చేయడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన బాహుబలి మూవీ ద్వారా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ , పలువురు బాలీవుడ్ నటీనటులతో రూపొందుతున్న సాహో మూవీకి దర్శకత్వ బాధ్యత సుజీత్ అప్పగించడం అతని పై నిర్మాతలకు ఉన్న నమ్మకం అని చెప్పాలి. 2017 సంవత్సరం జూన్ లో ప్రారంభమయిన సాహో మూవీ రెండు సంవత్సరాల తరువాత 2019 ఆగస్ట్ 15వ తేదీ రిలీజ్ కానుంది. 2సంవత్సరాల పాటు మూడు భాషలలో రూపొందుతున్న సాహో మూవీ కి ఓపికతో పనిచేస్తున్న దర్శకుడు సుజీత్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి.
[youtube_video videoid=rDoFiOjoC2Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: