టైటిల్ అన్వేష‌ణ‌లో శ‌ర్వానంద్ చిత్రం

Sharwanand New Movie Team In Search Of A Title,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sharwanand New Movie News,Actor Sharwanand Upcoming Film News,Sharwanand Next Film Title,Interesting Title For Sharwanand New Movie
Sharwanand New Movie Team In Search Of A Title

యువ కథానాయకుడు శర్వానంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో ఓ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ల‌వ‌ర్ బాయ్‌గా, ఏజ్డ్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా… ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో శ‌ర్వానంద్ న‌టిస్తుండ‌గా… అత‌నికి జోడీగా కాజల్ అగర్వాల్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాకి సంబంధించి నాలుగు ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. క‌థ‌, హీరో క్యారెక్ట‌ర్‌కు త‌గ్గ‌ట్టుగా ‘దళపతి’, ‘రణరంగం’, ‘వ్యూహం’, పార్థు అనే నాలుగు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట. వీటిలో ‘దళపతి’ అయితే… ఈ సినిమాకు యాప్ట్‌గా ఉంటుందని భావిస్తోంద‌ట యూనిట్‌. అయితే… ఇప్పటికే ఈ టైటిల్‌ను వేరే నిర్మాత రిజిస్టర్ చేయించడంతో.. టైటిల్ విష‌యంలో పునరాలోచనలో పడిందట చిత్ర యూనిట్. ఒకవేళ ‘దళపతి’ టైటిల్ దొరకని పక్షంలో ‘రణరంగం’, ‘వ్యూహం’, పార్థు లలో ఏదో ఒక టైటిల్‌ను ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్టు వినికిడి. త్వ‌ర‌లోనే శ‌ర్వానంద్ కొత్త చిత్రం టైటిల్‌పై క్లారిటీ వ‌స్తుంది. కాగా… జూలై 5న ఈ సినిమా రిలీజ్ కానుంద‌ని టాక్‌.

[subscribe]
[youtube_video videoid=Q8O_RADN9U0 ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + one =