మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో.. మ‌హేష్ న‌యా రికార్డు

Mahesh Babu Bags Another Record With Maharshi,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Movie Enters Million Dollar Club,Maharshi Movie Latest Collections,Mahesh Babu Maharshi Movie Record Collections,Maharshi Joins The Million Dollar Club
Mahesh Babu Bags Another Record With Maharshi

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా నటించిన 25వ చిత్రం ‘మహర్షి’. ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా… ఇటు అభిమానులు, ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను కూడా విశేషంగా అలరిస్తోంది. అంతేకాదు… బాక్సాఫీస్ వ‌ద్ద కూడా కాసుల పంట పండిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా… ఓవర్సీస్‌లోనూ మరోసారి సత్తా చాటుతున్నాడు మహేష్. శనివారం నాటికి మ‌హ‌ర్షి 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరడంతో… టాలీవుడ్ నుంచి ఈ క్లబ్‌లో చేరిన తొలి ట్రిపుల్ హ్యాట్రిక్ హీరోగా మహేష్ చరిత్ర సృష్టించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘దూకుడు’(2011)తో ప్రారంభమైన మహేష్ మిలియ‌న్ డాల‌ర్ల హ‌వా… ఆ తరువాత‌ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’(2013), ‘1 నేనొక్కడినే’(2014), ‘ఆగడు’(2014), ‘శ్రీమంతుడు’(2015), ‘బ్రహ్మోత్సవం’(2016), ‘స్పైడర్’(2017), ‘భరత్ అనే నేను’(2018), ‘మహర్షి’(2019) వరకు కొన‌సాగుతూనే ఉంది. 2012లో (బిజినెస్‌మేన్) మినహా ప్రతీ ఏటా ఈ హ్యాండ్స‌మ్‌ హీరో నటించిన ప్రతీ సినిమా ఈ క్లబ్‌లో చేరుతుండడం విశేషం. మున్ముందు.. మ‌హేష్ ఖాతాలో ఇంకెన్ని మిలియ‌న్ డాల‌ర్ల మూవీలు చేరుతాయో చూడాలి మ‌రి.

[subscribe]
[youtube_video videoid= eTCgaFWwKQA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + nineteen =