అత్యంత వైభవంగా ‘దాసరి మెమోరియల్ సినీ అవార్డ్స్’

Dasari Memorial Cine Awards 2019,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Dasari Film Awards Function,Dasari Narayana Memorial Film Awards Function 2019,Celebs About Dasari Film Awards,Filmmaker Dasari Narayana Awards Function
Dasari Memorial Cine Awards 2019

భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏ.బి.సి ఫౌండేషన్, భీమవరం టాకీస్ సంయుక్తంగా నిర్వహించిన ‘దాసరి మెమోరియల్ సినీ అవార్డ్స్’ ప్రదాన వేడుక ఘనంగా జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య, ఆంధ్రప్రదేశ్ ఎఫ్.డి.సి చైర్మన్ అంబికా కృష్ణ, తెలంగాణ ఎఫ్.డి.సి చైర్మన్ రామ్ మోహన్ రావు, ‘మా’ అధ్యక్షులు వి.కె.నరేష్, ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్, ప్రముఖ నటులు మురళీ మోహన్, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తదితర ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొని ఈ అవార్డులు ప్రదానం చేశారు.

దాసరి జీవన సాఫల్య పురస్కారం ఆర్.నారాయణమూర్తి, పూరి జగన్నాధ్ కి ప్రకటించిన దాసరి ఎక్స్ లెన్స్ అవార్డును ఆయన తరపున పూరి ఆకాష్, దాసరి నారాయణరావు-దాసరి పద్మ మెమోరియల్ అవార్డు రాజశేఖర్-జీవిత అందుకున్నారు. మీడియా నుంచి సీనియర్ జర్నలిస్ట్స్ వినాయకరావు, ప్రభు, సాయి రమేష్, రవిచంద్ర, మడూరి మధు దాసరి పురస్కారాలు అందుకున్నారు. అప్ కమింగ్ లిరిక్ రైటర్ గా సురేష్ గంగుల, ఉత్తమ సంగీత దర్శకురాలిగా శ్రీలేఖ, ఉత్తమ గీత రచయితగా జొన్నవిత్తులకు అవార్డులు అందించారు.

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్స్ గా గౌతమ్ తిన్ననూరి (మళ్ళీ రావే), వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ), వెంకటేష్ మహా (కేరాఫ్ కంచర పాలెం ), శశి కిరణ్ తిక్క (గూఢచారి) దాసరి అవార్డులు స్వీకరించారు. బాబ్జి (రఘుపతి వెంకయ్య), ఎస్.ఎం.ఎస్ సురేష్ (బెస్ట్ క్యాస్టింగ్ డైరెక్టర్) అర్జున్ (మ్యూజిక్) తదితరులు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. ఈ వేడుకను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ భారత్ ఆర్ట్స్ అకాడమీ అధినేత రమణారావు, భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.. పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. దాసరి పేరిట ప్రారంభించిన ఈ అవార్డ్స్ వేడుక ప్రతి ఏటా క్రమం తప్పక నిర్హహించాలని అతిధులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులను అభినందించారు!!

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here