బర్త్ డే రోజు స్పెషల్ అనౌన్స్ మెంట్

Dear Comrade Movie Special Surprise on Vijay Deverakonda Birthday,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Dear Comrade Movie Special Announcement on Vijay Deverakonda Birthday,Dear Comrade Movie Latest Updates,Vijay Deverakonda About Dear Comrade Movie,Vijay Deverakonda Birthday Special Surprise For Fans
Dear Comrade Movie Special Surprise on Vijay Deverakonda Birthday

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా డియర్ కామేడ్ర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో.. వినూత్నకథ తో తెరకెక్కుతున్న ఈసినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ లో ఉన్న రెండు కోణాలు ఒక్క టీజర్ లో చూపించిన విధానం అందరికీ నచ్చేసింది.

ఇక తాజా అప్ డేట్ ఏంటంటే…ఈనెల 9 వ తేదీన విజయ్ పుట్టినరోజు అన్నసంగతి తెలిసిందే. ఇక ఇదే రోజు ఈ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారట. అయితే ట్రైలర్ కు సంబంధించి కానీ… లేక రిలీజ్ డేట్ కు సంబంధించి కానీ అనౌన్స్ మెంట్ ఉండొచ్చన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. మరి చూద్దాం.. ఏం స్పెషల్ అనౌన్స్ మెంట్ ఇస్తారో..?

కాగా లవ్‌ ఎంటర్‌ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను బిగ్‌బెన్‌ సినిమా, మైత్రీ మూవీమేకర్స్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. కాకినాడ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ న‌టిస్తుండ‌గా .. క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ు అన్నీ త్వరలో కంప్లీట్ చేసి ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం… తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏక‌కాలంలో విడుదల కానుంది.

మరి ‘గీత‌గోవిందం’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత ఈ జంట క‌ల‌సి న‌టించిన‌ సినిమా కావ‌డంతో… ‘డియర్ కామ్రేడ్’పై ప్రేక్ష‌కుల్లో మంచి ఆస‌క్తి నెల‌కొంది. మరి ఈ సినిమాతో ఈ జంట మళ్లీ హిట్టు కొడుతుందో?లేదో? తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]


[youtube_video videoid=n3AqEHg6ofI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 15 =