మూడేళ్ళ `సోగ్గాడే చిన్నినాయ‌నా`

3 Years For Nagarjuna Blockbuster Movie Soggade Chinni Nayana,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Soggade Chinni Nayana Movie Updates,Soggade Chinni Nayana Telugu Movie Latest News,Nagarjuna Soggade Chinni Nayana Movie News,Akkineni Nagarjuna Soggade Chinni Nayana Telugu Movie Latest News,Three Years For King Nagarjuna Soggade Chinni Nayana Movie
3 Years For Nagarjuna Blockbuster Movie Soggade Chinni Nayana

కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించ‌డంలో అగ్ర క‌థానాయ‌కుడు నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. అలా… నాగార్జున ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుల‌లో క‌ళ్యాణ్ కృష్ణ ఒక‌రు. నాగార్జున ద్విపాత్రాభిన‌యంలో క‌ళ్యాణ్ కృష్ణ రూపొందించిన ఆ చిత్రమే `సోగ్గాడే చిన్నినాయ‌నా`. ఫాంట‌సీ ఎలిమెంట్స్‌తో రూపొందిన‌ ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో కుటుంబ విలువ‌లు, హాస్యం, రొమాన్స్… ఇలా అన్ని అంశాల‌కు స్థాన‌ముంటుంది. నాగార్జునకి జోడీగా ర‌మ్య‌కృష్ణ‌, లావ‌ణ్య త్రిపాఠి న‌టించిన ఈ చిత్రంలో అనుష్క అతిథి పాత్ర‌లో మెరిసింది. అన‌సూయ‌, హంసా నందిని, బ్ర‌హ్మానందం, సంప‌త్ రాజ్‌, నాజ‌ర్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీత సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. క‌న్న‌డంలో ఈ చిత్రాన్ని `ఉపేంద్ర మ‌ట్టే బా` పేరుతో రీమేక్ చేయ‌గా… ఉపేంద్ర‌, ప్రేమ‌, శ్రుతి హ‌రిహ‌ర‌న్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15, 2016న విడుద‌లైన `సోగ్గాడే చిన్నినాయ‌నా`… నాగార్జున కెరీర్‌లోనే హయ్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. నేటితో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చి మూడేళ్ళు పూర్త‌వుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 6 =