టాలెంటెడ్ డైరెక్టర్‌లను ప్రోత్సహించడంలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ `దిల్`రాజు ఎప్పుడూ ముందుంటారు. అందుకే… ఆయన సంస్థలో పలువురు దర్శకులు రెండేసి సినిమాలు చేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. అయితే… ఈ బేనర్‌లో మూడు సినిమాలు రూపొందించిన ఘనత మాత్రం ఇప్పటివరకు ముగ్గురిదే. ఆ దర్శకులే వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి. `దిల్` రాజు నిర్మాణంలో `మున్నా`, `బృందావనం`, `ఎవడు` చిత్రాలను వంశీ పైడిపల్లి తెరకెక్కించగా… `రామయ్యా వస్తావయ్యా`, `సుబ్రమణ్యం ఫర్ సేల్`, `డీజే` చిత్రాలను హరీష్ శంకర్ రూపొందించాడు. అయితే.. ఈ ఇద్దరికీ రెండేసి విజయాలు మాత్రమే దక్కాయి. అయితే… ఇదే సంస్థలో `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుని… తాజాగా `ఎఫ్ 2`తో హ్యాట్రిక్ హిట్‌ని కూడా అందుకుని దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. మున్ముందు… `దిల్` రాజు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరిన్ని విజయవంతమైన చిత్రాలు రావాలని కోరుకుందాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: