బ్రిలియంట్ డైరెక్ట‌ర్‌ సుకుమార్‌కి హ్యాపీ బ‌ర్త్ డే

Telugu FilmNagar Wishes Sukumar A Very Happy Birthday,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Happy Birthday Director Sukumar,Director Sukumar Birthday Special News,Sukumar Birthday Celebrations,#HBDSukumar
Telugu FilmNagar Wishes Sukumar A Very Happy Birthday

సుకుమార్‌… చేసింది త‌క్కువ సినిమాలే అయినా సినీ ప‌రిశ్ర‌మ నుంచి ప్రేక్ష‌కలోకం వ‌ర‌కు అంద‌రిచేత బ్రిలియంట్ డైరెక్ట‌ర్ అనిపించుకున్న ద‌ర్శ‌కుడు. నిండా ప‌ది సినిమాల అనుభ‌వం కూడా లేక‌పోయినా… టాలీవుడ్‌లో ప్ర‌తీ హీరో ఈ ద‌ర్శ‌కుడి టాలెంట్‌కు ఫిదా అవుతారు. జయాప‌జయాల‌ను ప‌క్క‌న పెడితే… సుక్కు తెర‌కెక్కించిన సినిమాల్లో `స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌` అనేలా ఏదో ఓ కొత్త‌ విష‌యం ఉంటుందన్న న‌మ్మ‌కం ఉంటుంది ప్రేక్ష‌కుల్లోనూ… అలాగే ప‌రిశ్ర‌మ‌లోనూ. అంతేకాదు… టేకింగ్‌లో, స్క్రీన్‌ప్లేలో త‌న‌దైన మార్కును ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటారీ లెక్క‌ల మాస్టర్‌. అందుకే సుకుమార్ డైరెక్ష‌న్‌లో న‌టించాల‌ని స్టార్ హీరోల ద‌గ్గ‌ర నుంచి… అప్‌క‌మింగ్ హీరోల వ‌ర‌కు అంతా భావిస్తూ ఉంటారు. ఇక… ఈ రోజు పుట్టిన‌రోజు జరుపుకుంటున్న సుకుమార్‌కి విషెస్ చెబుతూ… ఆయన ట్రాక్ రికార్డును ఓసారి పరిశీలిస్తే…

2004లో విడుద‌లైన `ఆర్య‌`తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశారు సుకుమార్ . తొలి చిత్రంతోనే వైవిధ్య‌భ‌రిత‌మైన ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. `వ‌న్ సైడ్ ల‌వ్` అంటూ డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీని ప్రజెంట్ చేసిన సుక్కు డైరెక్ష‌న్‌కు, స్క్రీన్‌ప్లేకు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. తొలి చిత్రంతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకోవ‌డంతో పాటు… ప‌లు అవార్డుల‌ను కూడా త‌న సొంతం చేసుకున్నారు సుకుమార్. ఆ త‌ర్వాత ‘జ‌గ‌డం’, ‘ఆర్య‌2’ సినిమాలు అనుకున్నంత‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయాయి. అయితే… 2011లో వ‌చ్చిన‌ ‘100% ల‌వ్‌’తో మ‌రో విజ‌యం త‌న ఖాతాలో వేసుకుని త‌నో డిఫ‌రెంట్ డైరెక్ట‌ర్ అని మ‌రోసారి నిరూపించుకున్నారు సుక్కు. మ‌హేష్ బాబుతో ‘1 నేనొక్క‌డినే’, య‌న్టీఆర్‌తో ‘నాన్న‌కు ప్రేమ‌తో’ వంటి సినిమాల‌ను రూపొందించి త‌న ప్ర‌తిభ‌ను చాటుకున్నారు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. ‘కుమారి 21F’ సినిమాతో నిర్మాత‌గా కూడా మారి మంచి విజ‌యాన్ని అందుకున్నారు. ఇక గ‌త ఏడాది రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కించిన ‘రంగ‌స్థ‌లం’తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబుతో మ‌రోసారి జ‌ట్టు క‌ట్టే ప‌నిలో ఉన్నారు సుకుమార్‌. ఈ ఏడాది ఈ సినిమా ప‌ట్టాలెక్కే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మ‌హేష్ తో చేయ‌బోయే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి… ఈ లెక్క‌ల మాస్టర్ కెరీర్ విజ‌య‌ప‌ధంలో దూసుకు పోవాల‌ని ఆశిస్తూ… 49వ ప‌డిలో అడుగుపెడుతున్న సుకుమార్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెబుతోంది `ద తెలుగు ఫిల్మ్‌న‌గ‌ర్. కామ్‌`.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here