సక్సెస్‌ఫుల్ హీరోయిన్ సమంత… ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. పెళ్ళయ్యాక తన భర్త, యువ కథానాయకుడు నాగచైతన్యతో కలసి `మజిలీ` సినిమా చేస్తున్న సామ్… మరోవైపు కొరియన్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెరకెక్కుతున్న `ఓ బేబీ` (ప్రచారంలో ఉన్న పేరు)లోనూ నటిస్తోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న `ఓ బేబీ`లో సామ్… 20 ఏళ్ళ పడుచు పిల్లగానూ, 70 ఏళ్ళ బామ్మగానూ కనిపించబోతుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం… సమంత 20 ఏళ్ళ అమ్మాయి పాత్రలోనే కనిపించనుందని సమాచారం. 70 ఏళ్ళ బామ్మ పాత్రలో సీనియర్ నటి లక్ష్మీ కనిపించనున్నారట. వాస్తవానికి… ఒరిజినల్ వెర్షన్‌లోనూ ఈ రెండు పాత్రలను వేర్వేరు ఆర్టిస్టులే చేశారు. అయితే… ఇక్కడ చిన్న ప్రయోగంలా సామ్ చేత రెండు పాత్రలను చేయించాలనుకున్నారు. 70 ఏళ్ళ పాత్ర కోసం ప్రొస్థెటిక్ మేకప్‌తో రక్తి కట్టించాలనుకున్నారు. అయితే… కొన్ని కారణాల వల్ల… ఈ ప్రాసెస్ వల్ల సినిమా ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో… ఆ ఆలోచన మానుకున్నారట. మొత్తానికి… రెండు విభిన్న పాత్రల్లో ఇద్దరు టాలెంటెడ్ యాక్ట్రస్ ను చూసే అవకాశం దక్కుతుందన్నమాట. నాగ శౌర్య ఓ కీలక పాత్రలో నటిస్తున్న `ఓ బేబీ` ఈ ఏడాది వేసవిలో తెరపైకి రానుంది.
[youtube_video videoid=xGA69pFMWTo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: