తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టే స్టార్ హీరో అజిత్ కుమార్ కు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సంక్రాంతి పండుగ నేపధ్యం లో రజనీకాంత్ నటించిన పెట్టా, అజిత్ కుమార్ నటించిన విశ్వాసం సినిమాలు జనవరి 10 వ తేదీ రిలీజయ్యాయి. దీంతో థియేటర్స్ వద్ద అభిమానుల సందడి నెలకొంది. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకపోయింది. మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని థియేటర్స్ వద్ద అభిమానులు అలజడి సృష్టించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళనాడు రాష్ట్రం వేలూరు లో ఒక థియేటర్ వద్ద రజనీ, అజిత్ అభిమానులు తీవ్ర ఘర్షణ పడ్డారు. రజనీకాంత్ మూవీ ఫ్లెక్సీలను అజిత్ అభిమానులు చించేయడంతో ఇరు వర్గాల మధ్య గొడవ రాజుకుంది. కొందరు కత్తులతో దాడి చేయడంతో నలుగురు అభిమానులు కత్తి పోట్లకు గురై తీవ్రం గా గాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు సినిమాల థియేటర్స్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటయింది. అభిమానుల పేరుతో థియేటర్స్ వద్ద అలజడులు సృష్టిస్తే ఊరుకోమని పోలీసులు హెచ్చరించారు.
[youtube_video videoid=5td3HmlYLTU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: