కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Venkatesh Latest News

ట్యాగ్ · 26 కథనాలు

Victory Venkatesh Funny Warning To Netflix Over Rana Naidu Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rana Naidu,Rana Naidu Web Series,Rana Naidu Telugu Web Series,Rana Naid
ఓటీటీ

రానా నాయుడు- నెట్ ఫ్లిక్స్ కు వెంకీ ఫన్నీ వార్నింగ్

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా ఎంత నడుస్తుందో చూస్తున్నాం. అందుకే స్టార్ సెలబ్రిటీలు సైతం వెబ్ సిరీస్ లు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తున్నారు. వారు ఎవరో కాదు దగ్గుబాటి ఫ్యామిలీ నుండి విక్టరీ వెంకటేష్ ఇంకా రానా. వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టాలీవుడ్ అగ్రహీరో గా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు రానా.. టాలెంటెడ్ హీరో. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. చిత్రీకరణ కూడా పూర్తిచేసుకుంది. ఇప్పటికే ఈసిరీస్ టీజర్ కూడా రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Venkatesh Saindhav Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Saindhav,Saindhav Movie,Saindhav Telugu Movie,Saindhav Update,Saindhav Updates,Saindhav Movie Upd
సినిమా వార్తలు

మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో వెంకటేష్ సైంధవ్ ?

సీనియర్ హీరోలలో వెంకటేష్ ది సపరేట్ స్టైల్.. ఆయన ఎంచుకునే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ వెంకటేష్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఓ వైపు సోలోగా సినిమాలు చేస్తూనే మరో వైపు మల్టీ స్టారర్ సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడు వెంకీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమాగా ఈ మూవీ రానుంది.

Team TFNవాట్సాప్
Venkatesh 75th Movie Glimpse Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Venkatesh 75 Movie Glimpse Release Time Fixed,Venkatesh Latest Film With Sailesh Kolanu, Latest Telugu
ట్రైలర్ & టీజర్

వెంకీ 75 గ్లింప్స్ రిలీజ్

టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక సినిమా తరువాత మరొకటి చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో అలరించాడు వెంకీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా చేసేస్తున్నాడు. రానాతో కలిసి రానా నాయుడు అనే ఓ వెబ్ సిరీస్‌‌ను చేస్తున్నారు. ఈసిరీస్ లో డిఫరెంట్ మేకోవర్ తో అలరిస్తున్నాడు వెంకీ. విడుదలకు రెడీ అయిన ఈ వెబ్ సిరీస్‌ నుంచి ఇటీవల టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 75వ సినిమాను సిద్దం చేస్తున్నాడు. ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రెండు రోజుల క్రితమే ఇచ్చారు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో…

TFN Adminవాట్సాప్
Venkatesh 75 Movie Glimpse Release Time Fixed,Venkatesh Latest Film With Sailesh Kolanu, Latest Telugu Movies News, Latest Tollywood News, Sailesh Kolanu Latest News, Telugu Film News 2023, Telugu Filmnagar, Tollywood Movie Updates, Venkatesh, Venkat
ట్రైలర్ & టీజర్

వెంకీ 75 గ్లింప్స్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

విక్టరీ వెంకటేష్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా చూస్తుంది ఆయన మైల్ స్టోన్ సినిమా గురించి. ఆయన 75వ సినిమా కోసం ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఊరటనిస్తూ ఈసినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ నిన్న వచ్చిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు పూర్తి వివరాలు రేపు రిలీజ్ చేస్తామని కూడా తెలిపారు. ఈనేపథ్యంలో తాజాగా ఈ గ్లింప్స్ కు రిలీజ్ టైమ్ ను కూడా ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. వెంకీ 75 వ గ్లింప్స్ ను రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు వారు పోస్టర్ రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Victory Venkatesh 75th Movie Announcement,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Venkatesh,Venkatesh Latest News,Venkatesh Upcoming Movie News,Venkatesh Latest Film Details,Venka
సినిమా వార్తలు

వెంకీ 75 అనౌన్స్ మెంట్

టాలీవుడ్ అగ్రహీరోలు కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అంతేకాదు వరుస హిట్లను సైతం సొంతం చేసుకుంటున్నారు. రీసెంట్ గా చిరంజీవి, బాలకృష్ణ తన సినిమాలతో సంక్రాంతి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది వెంకటేష్ సినిమా కోసం. గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వెంకీ. ఓరి దేవుడా సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. ఇక ఆ తరువాత తన కొత్త సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇంతవరకూ ఇవ్వలేదు. అయితే ఆ మధ్య తరణ్ భాస్కర్ తో సినిమా…

TFN Adminవాట్సాప్
F3 Movie Release Date Postponed for Bheemla Nayak, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, F3 Movie Release Date Postponed, F3 team changes their release date, : F3: Fun an
రిలీజ్ అప్‌డేట్

'భీమ్లానాయక్' కోసం వెనక్కి తగ్గిన 'ఎఫ్3'

ఫైనల్ గా భీమ్లానాయక్ రిలీజ్ డేట్ అయితే వాయిదా పడింది. ఇక భీమ్లానాయక్ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఎఫ్ 3 సినిమా రిలీజ్ డేట్ కూడా మార్చారు. నిజానికి ఎఫ్ 3 సినిమాను కూడా ముందు నుండి సంక్రాంతికే రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ.. పెండింగ్ పనులు ఉండటంతో ఈసినిమా రిలీజ్ ను సంక్రాంతి నుండి ఫిబ్రవరికి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు భీమ్లానాయక్ సినిమా ఫిబ్రవరికి రావడంతో ఎఫ్ 3ను వాయిదా వేస్తున్నట్టు దిల్ రాజు తెలిపారు. నేడు ప్రెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు.. భీమ్లానాయక్ రిలీజ్ డేట్ ఫిబ్రవరి 25కు వాయిదా వేస్తున్నట్టు అలానే ఎఫ్ 3 ను ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపాడు. సర్కారు వారి పాట ఏప్రిల్1న…

TFN Adminవాట్సాప్
Birthday Special POLL: Which Among These Is Your Favourite Movie Of Victory Venkatesh? Vote Now,Victory Venkatesh,Victory Venkatesh,Venkatesh Fans,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Venkatesh Daggubati,Venkatesh Latest Movie,Venkatesh 61st Bi
సినిమా వార్తలు

మీకు నచ్చిన వెంకీ బెస్ట్ మూవీ..?

విక్టరీ అంటే టాలీవుడ్ లో మనకు వెంటనే గుర్తొచ్చే పేరు వెంకటేష్. విక్టరీ ఎప్పుడూ తన ఫ్రెండ్ లా పక్కనే ఉంటుంది వెంకీ కి. అందుకే దగ్గుబాటి వెంకటేష్ ప్లేస్ లో విక్టరీ వెంకటేష్ రీప్లేస్ అయింది. 1986లో క‌లియుగ పాండ‌వులు సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు వెంకీ. తొలి సినిమాతోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌డ‌మే కాకుండా నంది అవార్డు కూడా అందుకున్నాడు. మొదట కాస్త విమర్శలు ఎదుర్కొన్నా ఆ తరువాత మాత్రం వెంకీ సినిమా అంటే చాలు ఖచ్చితంగా హిట్ అయినట్టేఅన్న నమ్మకానికి వచ్చారు అందరూ. ఇక ఆ తరువాత తన కెరీర్ లో ఎన్నో కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం దక్కించుకున్నాడు. అందుకే అందరి హీరోల అభిమానులు కూడా వెంకీ కి…

TFN Adminవాట్సాప్
Venkatesh To Team Up With Salman Khan For Sajid Nadiadwala’s Next,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Venkatesh Daggubati,Venkatesh,Venkate
సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ లో వెంకటేష్ ?

సూపర్ హిట్ "చిన్న తంబి "తమిళ మూవీ హిందీ రీమేక్ "అనారీ" (1993)మూవీ తో హీరో వెంకటేష్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ ఘనవిజయం సాధించింది. తరువాత వెంకటేష్ హీరోగా సూపర్ హిట్ "యమలీల"తెలుగు మూవీ హిందీ రీమేక్ "తక్ దీర్ వాలా "తెరకెక్కింది. ఆ మూవీ ఏవరేజ్ గా నిలిచింది. తరువాత హీరో వెంకటేష్ మరే హిందీ మూవీ లోనూ నటించలేదు. 25సంవత్సరాల తరువాత వెంకటేష్ ఒక బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Venkatesh About Movie With Tharun Bhascker,Telugu Filmnagar,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Drushyam 2 Movie Latest Updates,Drushyam 2 Official Teaser,Venkatesh Daggubati,Meena,New Telugu Movie 2021,Drushyam,Drushyam 2,Drush
సినిమా వార్తలు

'తరుణ్ భాస్కర్' స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు

టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న కొత్త డైరెక్టర్లలో తరు ణ్ భాస్కర్ కూడా ఒకడు. మొదటిసినిమా పెళ్లి చూపులు తోనే తన సత్తా చాటాడు. చిన్న సినిమా తీసి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. ఆ సినిమా తర్వాత తానే హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా తీసాడు. ఇదిలా ఉండగా వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ సినిమా చేస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్య దీనిపై ఎలాంటి న్యూస్ కానీ క్లారిటీ కానీ రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై క్లారిటీ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Victory Venkatesh Opens up about OTT platforms,Telugu Filmnagar,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Drushyam 2 Latest Updates,Drushyam 2 Film Update,Drushyam 2 Movie Latest Updates,Drushyam 2 Official Teaser,Venkatesh Daggubati,
ఓటీటీ

ఓటీటీలలో ఉండే అందం అదే- వెంకటేష్

శ్రీ ప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం ” తెలుగు రీమేక్ మూవీ “దృశ్యం ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ , ఆశీర్వాద్ సినిమాస్ , రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై జీతు జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం 2” మూవీ తెలుగు రీమేక్ "దృశ్యం 2″ మూవీ నవంబర్ 25 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానుంది. రీసెంట్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Victory Venkatesh To Make A Remake Of Spanish Web Series,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Victory Venkatesh,Venkatesh,Actor Venkatesh,Hero Venkatesh,Venkatesh
సినిమా వార్తలు

వెంకీ కోసం స్పానిష్ సిరీస్..!

ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం ఒక లాంగ్వేజ్ లో హిట్ అయిన సినిమాను మరో లాంగ్వేజ్ లో వెంటనే రీమేక్ చేసేస్తున్నారు. మేకర్స్ కూడా హిట్ సినిమాల రైట్స్ ను అంతే ఫాస్ట్ గా సొంతం చేసుకోడానికి చూస్తున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అయితే ఆ విషయంలో కాస్త ముందే ఉంటారు. ఇప్పటికే వెంకీ తో ఎన్నో సినిమాల రీమేక్ లు తెరకెక్కించి హిట్స్ కొట్టారు. ఇక ఇప్పుడు తాజాగా వెంకీ కోసం స్పానిష్ సిరీస్ ను రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది. సురేష్ బాబు ఈ సిరీస్ హక్కులను సొంతం చేసుకోడానికి చూస్తున్నట్టు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే నెట్ ఫ్లిక్స్ వారు కానీ లేకపోతే సురేష్ బాబే స్వయంగా ఈ రీమేక్ ను…

TFN Adminవాట్సాప్
Sree Vishnu Receives Best Wishes From Victory Venkatesh On His New Movie Release,Venkatesh,Venkatesh Movies,Venkatesh New Movie,Venkatesh Latest News,Sree Vishnu About Venkatesh,Victory Venkates,Sree Vishnu Receives Best Wishes From Victory Venkatesh
సినిమా వార్తలు

వెంకీ గారి ఆశీస్సులు తీసుకున్నా

హసిత్‌ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు రాజ రాజ చోర అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఈనెల 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా శ్రీ విష్ణు స్పీడు పెంచాడు. నిజానికి ఇప్పటివరకూ తన సినిమాల గురించి ఎప్పుడూ మాట్లాడనంతగా ఈసినిమా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు శ్రీ విష్ణు. అంతేకాదు వెంకీ నారప్ప గురించి కూడా మాట్లాడిన సంగతి తెలిసిందే కదా. 'విక్టరీ వెంకటేష్ గారికి నేను వీరాభిమానిని. నారప్ప చిత్రం ఓటిటిలో రిలీజ్ కావడం బాధగా అనిపించింది. రెండు రోజుల పాటు భోజనం కూడా చేయలేదు. సూపర్ స్టార్స్ నటించే చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కావాలంటే ముందుగా చిన్న చిత్రాలకు…

TFN Adminవాట్సాప్
Victory Venkatesh Lines Up Three Major Projects in 2022,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Victory Venkatesh,Actor Venkatesh,Hero Venkatesh,Venkatesh Latest News,Venkatesh Movies,Venkatesh New Mov
సినిమా వార్తలు

2022 లో మూడు ప్రాజెక్టులతో వెంకీ..!

యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్ర హీరోలు కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో వెంకీ ఇంకా సూపర్ ఫాస్ట్ గా ఉన్నాడు. ఇప్పటికే వెంకీ ఈ ఏడాది మూడు సినిమాలతో సిద్దంగా ఉన్నాడు. అందులో ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3 సినిమా.. ఇంకా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న నారప్ప, ఇంకా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వస్తున్న దృశ్యం2 సినిమా. ఈ మూడు సినిమాల్లో ఇప్పటికే రెండు సినిమాలు నారప్ప, దృశ్యం 2 రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఎఫ్3 సినిమా మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే ఈసినిమా కూడా దాదాపు ఈ ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

TFN Adminవాట్సాప్
Actress Priyamani Is All Praises For Victory Venkatesh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Priyamani,Actress Priyamani,Heroine Priyamani,Priyamani Latest News,Priyamani News,P
సినిమా వార్తలు

ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది..!

ఎవరే అతగాడు సినిమాతో అరంగేట్రం చేసినా.. 'పెళ్ళైనకొత్తలో సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది ప్రియమణికి. ఇక ఆ సినిమాతో వరుసగా ఆమెకు సినిమా ఆఫర్స్ వచ్చాయి. తన పదిహేనేళ్ల కెరీర్ లో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ ఇలా పలు భాషా చిత్రాల్లో ఎంతో మంది హీరోలతో నటించింది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి.. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో పలు పాత్ర ప్రధానమైన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది.

TFN Adminవాట్సాప్
Drushyam 2 Movie Team Completes Shooting Ahead Of Its Target Finished Date
షూటింగ్ అప్‌డేట్

'దృశ్యం 2' - టార్గెట్ కంటే ముందే

జీతూ జోసఫ్ దర్శకత్వంలో వెంకీ ప్రధాన పాత్రలో దృశ్యం రీమేక్ దృశ్యం 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. అసలు ఈసీక్వెల్ ఉంటుందో లేదో అన్న డౌట్ నుండి సినిమా పట్టాలెక్కింది.. అలా షూటింగ్ మొదలుపెట్టారో లేదో చాలా తొందరగా సినిమా షూటింగ్ ను కూాడా పూర్తి చేశారు. 50రోజులు మాత్రమే ఈసినిమా షూటింగ్ కు టార్గెట్ పెట్టుకున్నారు.. కానీ 50రోజుల కంటే తక్కువగానే సినిమా పూర్తయినట్టు తెలుస్తుంది. గత కొద్దిరోజులుగా ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ ఏడాదే ఈసినిమాను రిలీజ్ చేయాలన్న నేపథ్యంలో అస్సలు గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ ను చేశారు. రీసెంట్ గానే వెంకీ తన పార్ట్ ను పూర్తిచేసుకోగా.. ఇప్పుడు షూటింగ్ మొత్తం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నవంబన్ నుండి వెంకీ కూడా రెడీ

దాదాపు టాలీవుడ్ హీరోలందరూ షూటింగ్ లను మొదలు పెట్టేసారు. యంగ్ హీరోలు అయితే చాలా మంది షూట్ ను మొదలుపెట్టేసారు. కొంతమంది అయితే షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇక అగ్ర హీరోల్లో ముందు నాగార్జున షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు షూటింగ్ కోసం విదేశాలకు కూడా వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు మరో అగ్ర హీరో కూడా షూట్ కు రెడీ అయిపోయాడు. ఆ హీరో ఎవరో కాదు వెంకీ.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వెంకీ 75 పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో తమిళ్ సూపర్ హిట్ మూవీ 'అసురన్' తెలుగు రీమేక్ నారప్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయి కొంత చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లను రిలీజ్ చేశారు. ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇది వెంకీకి 74వ సినిమా.

TFN Adminవాట్సాప్
Lockdown Ends But Not The Virus Tweets Tollywood Actor Victory Venkatesh
సినిమా వార్తలు

లాక్ డౌన్ మాత్రమే ముగుస్తుంది.. కరోనా కాదు..!

కరోనా వల్ల గత రెండు నెలల నుండి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే కాస్త లాక్ డౌన్ లో సడలింపులు చేస్తున్నారు. మాల్స్, థియేటర్స్ పబ్లిక్ ఎక్కువగా వుండే ప్లేస్ లు మినహాయించి అన్నిటికి అనుమతులు ఇచ్చారు. అంతే కాదు సినిమా షూటింగ్ లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై వెంకీ స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ ముగిసిందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దేశం మొత్తం తీవ్ర ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో వెంకటేష్ ?

ప్రస్తుతం చలన చిత్ర పరిశ్రమలో ట్రెండ్ మారుతుంది. స్టార్ డమ్ ఉన్న హీరో, హీరోయిన్స్ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంత "ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2" , సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ , లేట్ తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన "క్వీన్ "వెబ్ సిరీస్ లలో నటించారు. కాజల్ అగర్వాల్, తమన్నా, రకుల్ ప్రీత్, హన్సిక , అంజలి,ప్రియమణి వంటి టాప్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ లకు మొగ్గుచూపుతున్నారు.

Team TFNవాట్సాప్
Victory Venkatesh Sensational Hit Raja Movie Completes 21 Years
సినిమా వార్తలు

విక్ట‌రీ వెంక‌టేష్ `రాజా`కి 21 ఏళ్ళు

విక్ట‌రీ వెంక‌టేష్, అభినేత్రి సౌంద‌ర్య కాంబినేష‌న్ లో ప‌లు మ్యూజికల్ హిట్స్ వ‌చ్చాయి. వాటిలో `రాజా` ఒక‌టి. త‌మిళ చిత్రం `ఉన్నిడ‌త్తిల్ ఎన్నై కొడుత్తేన్` (కార్తిక్, రోజా) ఆధారంగా తెర‌కెక్కిన ఈ రీమేక్ మూవీని ముప్ప‌ల‌నేని శివ తెర‌కెక్కించాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో అబ్బాస్, సుధాక‌ర్, చంద్ర‌మోహ‌న్, బ్ర‌హ్మానందం, త‌నికెళ్ళ భ‌ర‌ణి, అన్న‌పూర్ణ‌, వై.విజ‌య‌, స‌న త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

Team TFNవాట్సాప్

షేర్