టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక సినిమా తరువాత మరొకటి చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో అలరించాడు వెంకీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా చేసేస్తున్నాడు. రానాతో కలిసి రానా నాయుడు అనే ఓ వెబ్ సిరీస్‌ను చేస్తున్నారు. ఈసిరీస్ లో డిఫరెంట్ మేకోవర్ తో అలరిస్తున్నాడు వెంకీ. విడుదలకు రెడీ అయిన ఈ వెబ్ సిరీస్ నుంచి ఇటీవల టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 75వ సినిమాను సిద్దం చేస్తున్నాడు. ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రెండు రోజుల క్రితమే ఇచ్చారు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. నిజానికి వెంకీ 75 సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటుందని ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే ఫైనల్ గా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను చేతిలో తన సినిమా బాధ్యతలు పెట్టాడు వెంకీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా గ్లింప్స్ ను నేడు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. చెప్పినట్టే తాజాగా ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ లో చిత్రయూనిట్ కు సంబంధించిన వివరాలను తెలియచేశారు మేకర్స్. ఈసినిమాకు సైంధవ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక గ్లింప్స్ లో శైలేష్ చూపించిన విజువల్స్ కానీ ఎలివేషన్స్ కానీ సాలిడ్ గా ఉన్నాయి. ఇక వెంకటేష్ కూడా ఇంటెన్స్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిచనున్నాడు. ఇక షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టనున్నట్టు తెలిపారు. మరి గ్లింప్స్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచేశారు.
He is Dangerous🤘🏻He is Deadly🔥&
He is Decisive😎Presenting @VenkyMama to the INDIAN CINEMA as #SAINDHAV 🔥
A new age action film👊🏾
by @KolanuSailesh🎬A @NiharikaEnt Production@vboyanapalli @Music_Santhosh @maniDop @tkishore555 @SVR4446 #Venky75 pic.twitter.com/7Q3Zzuh8qv
— Niharika Entertainment (@NiharikaEnt) January 25, 2023
కాగా ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో వెంకీని శైలేష్ కొలను మునుపెన్నడూ లేని పాత్రలో చూపించబోతున్నాడట. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈసినిమా రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: