సీనియర్ హీరోలలో వెంకటేష్ ది సపరేట్ స్టైల్.. ఆయన ఎంచుకునే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ వెంకటేష్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఓ వైపు సోలోగా సినిమాలు చేస్తూనే మరో వైపు మల్టీ స్టారర్ సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడు వెంకీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమాగా ఈ మూవీ రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిహారిక ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ హిట్ , హిట్ 2 మూవీస్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా#VENKATESH 75 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ టైటిల్ సైంధవ్ గా చిత్ర యూనిట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో వెంకీ చాలా డిఫరెంట్ గా కనిపించనున్నారు. రఫ్ లుక్ లోవెంకటేష్ అదరగొట్టారు. ఈ మూవీ మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాతో పాటు వెంకటేష్ , రానాతో కలిసి ఒక వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: