ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా ఎంత నడుస్తుందో చూస్తున్నాం. అందుకే స్టార్ సెలబ్రిటీలు సైతం వెబ్ సిరీస్ లు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తున్నారు. వారు ఎవరో కాదు దగ్గుబాటి ఫ్యామిలీ నుండి విక్టరీ వెంకటేష్ ఇంకా రానా. వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టాలీవుడ్ అగ్రహీరో గా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు రానా.. టాలెంటెడ్ హీరో. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. చిత్రీకరణ కూడా పూర్తిచేసుకుంది. ఇప్పటికే ఈసిరీస్ టీజర్ కూడా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటగా ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతున్న నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించింది. తాజాగా ఈ నేపథ్యంలో రానా దగ్గుబాటి గురించి నెట్ ఫ్లిక్స్ గురించి వెంకటేష్ దగ్గుబాటి వార్నింగ్ ఇస్తూ చేసిన ఒక రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వీడియోలో వెంకీఈ సిరీస్ లో హీరో ఎవరు? నేను, స్టార్ ఎవరు? అది కూడా నేనే, అందంగా కనిపించేది ఎవరు? నేనే, ఫ్యాన్స్ కూడా నా వాళ్లే కాబట్టి ఈ షో పేరు కూడా నా పేరే ఉండాలి. నాగ నాయుడు అనే పేరుతో షో ఉండాలి అంటూ సీరియస్ గా ఫీన్నీ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈవీడియో వైరల్ గా మారింది.
Tera naam bhi meine rakha, show ka naam bhi mein rakhega.#RanaNaidu ki aisi ki taisi. @RanaDaggubati @NetflixIndia pic.twitter.com/R3GYlwZsEl
— Venkatesh Daggubati (@VenkyMama) February 13, 2023
కాగా ఈ వెబ్ సిరీస్ కి సుపర్ణ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహించారు. లోకోమోటివ్ గ్లోబల్ మీడియా మరియు LLPకి చెందిన సుందర్ ఆరోన్ లు ఈ వెబ్ సిరీస్ కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక పాన్ ఇండియా సిరీస్ గా తెరకెక్కించడంతో చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ సిరీస్ లో నటించారు. వెంకీ, రానాతో పాటు సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై, రాజేష్ జైస్, మరియు ప్రియా బెనర్జీ కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: