సూపర్ హిట్ “చిన్న తంబి “తమిళ మూవీ హిందీ రీమేక్ “అనారీ” (1993)మూవీ తో హీరో వెంకటేష్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ ఘనవిజయం సాధించింది. తరువాత వెంకటేష్ హీరోగా సూపర్ హిట్ “యమలీల”తెలుగు మూవీ హిందీ రీమేక్ “తక్ దీర్ వాలా “తెరకెక్కింది. ఆ మూవీ ఏవరేజ్ గా నిలిచింది. తరువాత హీరో వెంకటేష్ మరే హిందీ మూవీ లోనూ నటించలేదు. 25సంవత్సరాల తరువాత వెంకటేష్ ఒక బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ , సాజిద్ నడియాడ్ వాలా గ్రాండ్ సన్ బ్యానర్స్ పై ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , పూజాహెగ్డే జంటగా యాక్షన్ కామెడీ “భాయిజాన్ ” మూవీ తెరకెక్కనుంది. ఫస్ట్ ఈ మూవీ టైటిల్ కభీ ఈద్ కభీ దివాలీ ” అనుకున్నారు తరువాత టైటిల్ మారింది. ఈ మూవీ లో వెంకటేష్ మరో హీరోగా నటించనున్నారని సమాచారం. ఇటీవల “అంతిమ్” మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ఖాన్ తాను వెంకటేశ్‌తో కలసి ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: