లాక్ డౌన్ మాత్రమే ముగుస్తుంది.. కరోనా కాదు..!

Lockdown Ends But Not The Virus Tweets Tollywood Actor Victory Venkatesh
Lockdown Ends But Not The Virus Tweets Tollywood Actor Victory Venkatesh

కరోనా వల్ల గత రెండు నెలల నుండి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే కాస్త లాక్ డౌన్ లో సడలింపులు చేస్తున్నారు. మాల్స్, థియేటర్స్ పబ్లిక్ ఎక్కువగా వుండే ప్లేస్ లు మినహాయించి అన్నిటికి అనుమతులు ఇచ్చారు. అంతే కాదు సినిమా షూటింగ్ లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై వెంకీ స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ ముగిసిందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దేశం మొత్తం తీవ్ర ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

” గత 70 రోజులుగా కరోనా వైరస్ ను అరికట్టడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ధన్యవాదాలు. మా సంరక్షణ కోసం 24 గంటల పాటు సేవలు అందించిన వైద్య, పారిశుద్ధ్య, పోలీసులకు కృతజ్ఞలు తెలిపితే సరిపోదన్నారు. ఇప్పుడిప్పుడే మెల్లగా గేట్లు తెరుచుకుంటున్నాయి.. లాక్‌డౌన్‌ మాత్రమే ముగుస్తోందని… కరోనా మహమ్మారి అలానే ఉందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.. లాక్‌డౌన్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలను పాటించామో.. ఇకపై కూడా పాటించాలని సూచించారు.

కాగా ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘అసురన్’ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొంత వరకు షూటింగ్ కూడా జరుపుకుంది. ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here