విక్టరీ వెంకటేష్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా చూస్తుంది ఆయన మైల్ స్టోన్ సినిమా గురించి. ఆయన 75వ సినిమా కోసం ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఊరటనిస్తూ ఈసినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ నిన్న వచ్చిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు పూర్తి వివరాలు రేపు రిలీజ్ చేస్తామని కూడా తెలిపారు. ఈనేపథ్యంలో తాజాగా ఈ గ్లింప్స్ కు రిలీజ్ టైమ్ ను కూడా ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. వెంకీ 75 వ గ్లింప్స్ ను రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు వారు పోస్టర్ రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా హిట్ సిరీస్ తో పుల్ ఫామ్ లో ఉన్న శైలేష్ కొలను ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈసినిమాపై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీని శైలేష్ కొలను మునుపెన్నడూ లేని పాత్రలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: