వెంకీ 75 అనౌన్స్ మెంట్

Victory Venkatesh 75th Movie Announcement,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Venkatesh,Venkatesh Latest News,Venkatesh Upcoming Movie News,Venkatesh Latest Film Details,Venkatesh News Movie Details,Venkatesh 75th Movie,Venkatesh 75th Movie Latest News,Venkatesh News With Sailesh Kolanu,Her Venkatesh Latest Film With Sailesh Kolanu,Sailesh Kolanu Latest News,Venkatesh 75th Movie Announcement

టాలీవుడ్ అగ్రహీరోలు కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అంతేకాదు వరుస హిట్లను సైతం సొంతం చేసుకుంటున్నారు. రీసెంట్ గా చిరంజీవి, బాలకృష్ణ తన సినిమాలతో సంక్రాంతి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది వెంకటేష్ సినిమా కోసం. గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వెంకీ. ఓరి దేవుడా సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. ఇక ఆ తరువాత తన కొత్త సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇంతవరకూ ఇవ్వలేదు. అయితే ఆ మధ్య తరణ్ భాస్కర్ తో సినిమా చేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు వెంకీ కొత్త సినిమాపై క్లారిటీ వచ్చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా వెంకీ కెరీర్‌లో ప్రెస్టీజియ‌స్ మూవీగా రూపొందనున్నతన 75వ సినిమాకు సంబంధించిన ప్రకటన ఇచ్చారు మేకర్స్. హిట్ సిరీస్ తో పుల్ ఫామ్ లో ఉన్న శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ 75వ సినిమాను రూపొందించనున్నారు. ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను జ‌న‌వ‌రి 25న ప్ర‌క‌టించ‌బోతున్నట్టు తెలుపుతూ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో వెంక‌టేష్ తుపాకీలాంటిది ప‌ట్టుకుని నిలుచుని ఉండ‌టాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. నిహారిక ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 5 =