హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు రాజ రాజ చోర అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఈనెల 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా శ్రీ విష్ణు స్పీడు పెంచాడు. నిజానికి ఇప్పటివరకూ తన సినిమాల గురించి ఎప్పుడూ మాట్లాడనంతగా ఈసినిమా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు శ్రీ విష్ణు. అంతేకాదు వెంకీ నారప్ప గురించి కూడా మాట్లాడిన సంగతి తెలిసిందే కదా. ‘విక్టరీ వెంకటేష్ గారికి నేను వీరాభిమానిని. నారప్ప చిత్రం ఓటిటిలో రిలీజ్ కావడం బాధగా అనిపించింది. రెండు రోజుల పాటు భోజనం కూడా చేయలేదు. సూపర్ స్టార్స్ నటించే చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కావాలంటే ముందుగా చిన్న చిత్రాలకు ఆదరణ ఉండాలి’ అని శ్రీవిష్ణు అన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా శ్రీ విష్ణు వెంకీని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఇక ఈవిషయాన్ని తానే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తెలుగు ప్రేక్షకులు ఆగస్ట్ 19 న ఆశీర్వదించే ముందు మన వెంకటేష్ గారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషం గా ఉందని పేర్కొన్నారు. కచ్చితంగా మీ కుటుంబం తో కలిసి వస్తారని మా రాజ రాజ చోర ఆగస్ట్ 19 నుండి ఎదురు చూస్తూ ఉంటాడు అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
Telugu prekshakulu August 19th na aaseervadinche mundu mana Venkatesh gari aasessulu teeskovatam chaala santhosham ga undi. Khacchitanga mee kutumbam tho kalisostharani maa #RajaRajaChora August 19 nundi eduruchusthu untadu 🙏 pic.twitter.com/CbdkWj7xXo
— Sree Vishnu (@sreevishnuoffl) August 17, 2021
కాగా ఈ సినిమాలో మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునయన ముఖ్యపాత్ర పోషిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, రవిబాబు,కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్,వాసు ఇంటూరి తదితరులు నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: