విక్ట‌రీ వెంక‌టేష్ `రాజా`కి 21 ఏళ్ళు

Victory Venkatesh Sensational Hit Raja Movie Completes 21 Years

విక్ట‌రీ వెంక‌టేష్, అభినేత్రి సౌంద‌ర్య కాంబినేష‌న్ లో ప‌లు మ్యూజికల్ హిట్స్ వ‌చ్చాయి. వాటిలో `రాజా` ఒక‌టి. త‌మిళ చిత్రం `ఉన్నిడ‌త్తిల్ ఎన్నై కొడుత్తేన్` (కార్తిక్, రోజా) ఆధారంగా తెర‌కెక్కిన ఈ రీమేక్ మూవీని ముప్ప‌ల‌నేని శివ తెర‌కెక్కించాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో అబ్బాస్, సుధాక‌ర్, చంద్ర‌మోహ‌న్, బ్ర‌హ్మానందం, త‌నికెళ్ళ భ‌ర‌ణి, అన్న‌పూర్ణ‌, వై.విజ‌య‌, స‌న త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎస్.ఎ. రాజ్ కుమార్ స్వ‌ర‌సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. `ఏదో ఒక రాగం`, `క‌వ్వించ‌కే ఓ ప్రేమ‌`, `మ‌ల్లెల వాన‌`, `క‌న్నుల లోగిలో`, `ప‌ల్ల‌వించు తొలి రాగ‌మే`.. ఇలా ప్ర‌తీ పాట సంగీత‌ప్రియుల‌ను మురిపించింది. 71 కేంద్రాల‌లో 100 రోజులు ప్ర‌ద‌ర్శిత‌మైన `రాజా`కి గానూ `ఉత్త‌మ న‌టి`గా సౌంద‌ర్య‌, `ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు`గా ఎస్.ఎ. రాజ్ కుమార్ `ఫిల్మ్ ఫేర్` పుర‌స్కారాల‌ను పొందారు. అలాగే `ఉత్త‌మ చిత్రం` విభాగంలో మ‌రో `ఫిల్మ్ ఫేర్` ద‌క్కింది. 1999 మార్చి 18న విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన `రాజా`.. నేటితో 21 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + seventeen =