విక్టరీ అంటే టాలీవుడ్ లో మనకు వెంటనే గుర్తొచ్చే పేరు వెంకటేష్. విక్టరీ ఎప్పుడూ తన ఫ్రెండ్ లా పక్కనే ఉంటుంది వెంకీ కి. అందుకే దగ్గుబాటి వెంకటేష్ ప్లేస్ లో విక్టరీ వెంకటేష్ రీప్లేస్ అయింది. 1986లో కలియుగ పాండవులు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు వెంకీ. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ కొట్టడమే కాకుండా నంది అవార్డు కూడా అందుకున్నాడు. మొదట కాస్త విమర్శలు ఎదుర్కొన్నా ఆ తరువాత మాత్రం వెంకీ సినిమా అంటే చాలు ఖచ్చితంగా హిట్ అయినట్టేఅన్న నమ్మకానికి వచ్చారు అందరూ. ఇక ఆ తరువాత తన కెరీర్ లో ఎన్నో కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం దక్కించుకున్నాడు. అందుకే అందరి హీరోల అభిమానులు కూడా వెంకీ కి అభిమానులై ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నేడు వెంకీ తన పుట్టినరోజు ను జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం వెంకీ కెరీర్ విషయానికి వస్తే విక్టరీని ఎప్పుడూ పక్కన పెట్టుకున్నట్టే ప్రస్తుతం వరుస సినిమాలతో హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఎఫ్ 2, నారప్ప, రీసెంట్ గా వచ్చిన దృశ్యం ఇలా వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అయితే ఎఫ్ 3 సినిమాతో బిజీగాఉన్నాడు. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక నేడు వెంకీ పుట్టిన రోజు సందర్భంగా తను నటించిన సినిమాల్లో కొన్ని సినిమాల లిస్ట్ కింద ఇవ్వడం జరిగింది. మరి ఆ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో మీ ఓటు ద్వారా వెంకీ కి బర్త్ డే విషెస్ తెలియచేయండి.
[totalpoll id=”71413″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: