
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 39


"కార్తికేయ 2"మూవీ టీజర్ రిలీజ్ డేట్

విక్రమ్ టీమ్ తో జాయిఫుల్ నైట్..!

యష్ కు జోడీగా పూజా హెగ్డే..?

తమిళ్ హీరోను పెళ్లాడిన మధుశాలిని..!
ఇన్ స్టా గ్రామ్ లో అల్లు అర్జున్ రికార్డ్

'తీస్ మార్ ఖాన్' టీజర్ రిలీజ్

గోవా వెకేషన్ లో హీరో నాని

కీర్తి సురేష్ మనసులో మాట

'జెంటిల్ మెన్ 2' సినిమాటోగ్రాఫర్ ఫిక్స్..!

"MEGA 154"మూవీ సెట్స్ కు దర్శకుడు సుకుమార్

సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో గా జెనీలియా రీ ఎంట్రీ

ఆ సినిమాల రేంజ్ లోనే ప్రభాస్ సినిమా ఉంటుంది..!

'భారతీయుడు 2' పై కమల్ మరోసారి క్లారిటీ..!

భారీ యాక్షన్ మూవీ గా రజనీకాంత్ "జైలర్ "

'శభాష్ మిథు' ట్రైలర్ రిలీజ్
ప్రధాన పాత్రలో భారత మహిళా వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ బయోపిక్ లో మిథాలీ జీవితానికి సంబంధించి.. తన క్రికెట్ ఆరంగేట్రం గురించి ఎన్నో కీలకమైన అంశాలను చూపించనున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం అయితే రిలీజ్ కు సిద్దమవుతుంది. జులై 15వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

"ఏజెంట్ " మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

"కార్తికేయ 2"మూవీ టీజర్ రిలీజ్ డేట్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ జూలై 22 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

'విరాటపర్వం'పై కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశంసలు..!
వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా-సాయిపల్లవి కాంబినేషన్ లో వచ్చిన సినిమా విరాటపర్వం. ఈసినిమా ఈనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈసినిమా రావడంతో ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా అందరినీ ఆకట్టుకుంది. తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథ రావడంతో ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. అందుకే మంచి టాక్ ను సొంతం చేసుకుంటూ ప్రశంసలు అందుకుంటుంది.

తమిళనాడు లో "బాహుబలి 2"రికార్డ్ ను బ్రేక్ చేసిన "విక్రమ్"
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో సూర్య అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, ప్రత్యేక పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్రమ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా…

విక్రమ్ టీమ్ తో జాయిఫుల్ నైట్..!
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఎన్నో అంచనాల మధ్య ఈనెల 3వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుంది. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని కోలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు కలెక్షన్స్ విషయంలో అయితే అస్సలు తగ్గేదేలే అంటుంది ఈసినిమా. విక్రమ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 350 కోట్లకు చేరువయ్యాయి. ఇండియాలో విక్రమ్ రూ. 230 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఏపీ/తెలంగాణా రాష్ట్రాల్లో విక్రమ్ రూ. 15 కోట్ల షేర్ వరకూ రాబట్టింది. చాలా కాలం తరువాత ఈసినిమాతో మంచి విజయం దక్కినందుకు కమల్ మాత్రం చాలా హ్యాపీ గా ఉన్నారు. ఇప్పటికే…

యష్ కు జోడీగా పూజా హెగ్డే..?
కె.జి.యఫ్ సినిమాతో కన్నడ రాక్ స్టార్ యష్ దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడో తెలిసిందే కదా. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక దీని సీక్వెల్ గా వచ్చిన కె.జి.యఫ్ 2 కూడా రీసెంట్ గానే రిలీజ్ అయి మరో సంచలనం సృష్టిస్తుంది. ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉండగా.. ఆ అంచనాలను ఎక్కడా తగ్గించకుండా రాఖీభాయ్ తన సత్తా చూపించాడు. ఇక ఇప్పుడు యష్ నుండి ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.

తమిళ్ హీరోను పెళ్లాడిన మధుశాలిని..!
ఈరెండేళ్లలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రీసెంట్ గానే హీరో హీరోయిన్లు అయిన ఆది పినిశెట్టి-నిక్కి గర్లానీ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహమే. ఇప్పుడు మరో నటి కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆ నటి మరెవరో కాదు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన మధుశాలిని. పెద్ద హడావుడి లేకుండా మధుశాలిని పెళ్లి చేసుకుంది. వరుడు మరెవరో కాదు తమిళ నటుడు గోకుల్ ఆనంద్. ఇక ఈవిషయాన్ని మధుశాలిని కూడా తన ట్విట్టర్ ద్వారా ఫొటో షేర్ చేస్తూ అధికారికంగా తెలియచేసింది. తమ ఫొటోను షేర్ చేస్తూ ''మాకు లభించిన ప్రేమకు ధన్యవాదాలు. జీవితంలోని కొత్త అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. లవ్ మధు…
ఇన్ స్టా గ్రామ్ లో అల్లు అర్జున్ రికార్డ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్…

ఇజ్రాయిల్ దేశంలో కొమురం భీమ్ (ఎన్టీఆర్ )పై క్రేజ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో “ఆర్ ఆర్ ఆర్”మూవీ గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది…

'తీస్ మార్ ఖాన్' టీజర్ రిలీజ్
కల్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా వస్తున్న సినిమా తీస్ మార్ ఖాన్. ఇక ఈసినిమాలో ఆది మూడు డిఫరెంట్ షెడ్స్ లో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి టైటిల్ మరియు ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

గోవా వెకేషన్ లో హీరో నాని
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ మూవీ లో హీరో నాని తన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.సంప్రదాయ బ్రాహ్మణ కుర్రాడిగా నటించి ఆ పాత్రకి న్యాయం చేశారు.నజ్రియా నజీమ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

కీర్తి సురేష్ మనసులో మాట
తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.నాని హీరోగా తెరకెక్కుతున్న “దసరా” మూవీ లో కీర్తి కథానాయికగా నటిస్తున్నారు. “భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. “సాని కాయిధమ్ “, “మామన్నన్ ” (తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

'జెంటిల్ మెన్ 2' సినిమాటోగ్రాఫర్ ఫిక్స్..!
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అర్జున్ , మధుబాల జంటగా తెరకెక్కిన జెంటిల్ మెన్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. జెంటిల్ మెన్ సినిమాను నిర్మించిన కుంజుమోన్ జెంటిల్ మెన్ 2 సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు కూడా. ప్రస్తుతం అయితే ఈసినిమాకు కాస్టింగ్ కు సంబంధించిన ఎంపిక జరుగుతుంది. ఒక్కొక్కరినీ ఎంపిక చేస్తూ అధికారికంగా తెలియచేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో నటించే హీరోయిన్లను, డైరెక్టర్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు.

"MEGA 154"మూవీ సెట్స్ కు దర్శకుడు సుకుమార్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య ”(వర్కింగ్ టైటిల్ ) మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.”వాల్తేరు వీరయ్య "మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది . “వాల్తేరు వీరయ్య “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి మత్స్య కారుడిగా , మత్స్య కారులకు నాయకుడిగా ఒక మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.

సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో గా జెనీలియా రీ ఎంట్రీ
సూపర్ హిట్ “తుఝే మేరీ కసమ్ “మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన జెనీలియా “బాయ్స్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సక్సెస్ ఫుల్ “సత్యం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన జెనీలియా “సాంబ”, “బొమ్మరిల్లు , “ఢీ “, “రెడీ ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు.పలు తెలుగు , హిందీ , తమిళ మూవీస్ లో జెనీలియా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.2012 సంవత్సరం లో ఫిబ్రవరి 3 వ తేదీ తన మొదటి సినిమా హీరో రితేష్ దేశముఖ్ ను జెనీలియా వివాహం చేసుకున్నారు. “నా ఇష్టం “(2012} మూవీ తరువాత జెనీలియా సినిమాలకు దూరం అయ్యారు.

'ప్రాజెక్ట్ కే' పై క్లారిటీ.. షూటింగ్ ఆగలేదంటున్న మేకర్స్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ సినిమా ప్రాజెక్ట్ కే. ఈసినిమాకు మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తుండటంతో ఇప్పటినుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటి వరకూ పాన్ ఇండియా సినిమాలతో సందడి చేస్తున్న ప్రభాస్ ను ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ కు తీసుకెళుతున్నారు మేకర్స్. ఇక దీపికా పదుకొణెకు తెలుగులో ఇది తొలిచిత్రం. దీంతో వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆ సినిమాల రేంజ్ లోనే ప్రభాస్ సినిమా ఉంటుంది..!
ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో స్టైల్ ఉంటుంది. ఇక మారుతి కూడా తనకంటూ సెపరేట్ మార్క్ ను క్రియేట్ చేసుకోగలిగాడు. ఎక్కువగా కామెడీ కథలను అలానే కామెడీ తో పాటు యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్లను తెరకెక్కించడం మారుతి స్పెషల్. ఇక ఇప్పటివరకూ తన కెరీర్ లో తను అందుకున్న విజయాలు కూడా ఎక్కువే. ప్రస్తుతం అయితే తన దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది.

'భారతీయుడు 2' పై కమల్ మరోసారి క్లారిటీ..!
స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భారతీయుడు. 1996 లో వచ్చిన ఈసినిమా అప్పట్లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ చరిత్రలోనే ఈసినిమా కూడా ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోతుంది. ఇక ఈసినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా. అయితే ఈసినిమాను ఎప్పుడైతే మొదులుపెట్టారో అప్పటినుండీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. షూటింగ్ ప్రారంభించిన కొద్ది రోజులకే కమల్ కు ఆరోగ్య సమస్యలు రావడంతో ఆతరువాత ఎలక్షన్స్ అంటూ.. ఆ తరువాత క్రేన్ ప్రమాదం జరగడం ఇలా పలు ప్రాబ్లమ్స్ రావడంతో షూటింగ్ కు గ్యాప్ వచ్చింది. ఆ తరువాత ఏకంగా లైకాతోనే…

భారీ యాక్షన్ మూవీ గా రజనీకాంత్ "జైలర్ "
తమిళ , తెలుగు , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ , మేనరిజమ్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ తన 169 వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీ కి మేకర్స్ "జైలర్ "టైటిల్ ను ఫిక్స్ చేసి ఒక పోస్టర్ ను రిలీజ్ చేయగా , ఆపోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.