‘విరాటపర్వం’పై కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశంసలు..!

Kollywood Director is all praises for Virata Parvam,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Virata Parvam,Virata Parvam Movie,Virata Parvam Telugu Movie,Virata Parvam Momvie Updates,Virata Parvamlatest Superhit Movie,Sai Pallavi latest Movie Virata Parvam, Sai Pallavi,Actress Sai pallavi,Kollywood Director Praises Virata Parvam Movie,Kollywood Director Praises Sai Pallavi Virata Parvam Movie, Kollywood Director Ranjith Praises Sai Pallavi and Rana Daggubati Movie Virata Parvam,Kollywood Directcor Ranjith

వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా-సాయిపల్లవి కాంబినేషన్ లో వచ్చిన సినిమా విరాట‌ప‌ర్వం. ఈసినిమా ఈనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈసినిమా రావడంతో ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా అందరినీ ఆకట్టుకుంది. తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథ రావడంతో ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. అందుకే మంచి టాక్ ను సొంతం చేసుకుంటూ ప్రశంసలు అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా చూసిన వారందరూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకా సినీ సెలబ్రిటీలు కూడా చాలా మంది ఇప్పటికే స్పందించారు కూడా. ఈనేపథ్యంలో తాజాగా ఓ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కూడా విరాటపర్వం చూసి పొగడ్తలు కురిపించారు. ఈమేరకు ఆయన తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ కూడా చేశారు. ఈ మధ్య కాలంలో నేను చూసిన తెలుగు సినిమాల్లో బెస్ట్ తెలుగు సినిమా విరాటపర్వం.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇలాంటి సినిమా తీసినందుకు ప్రొడ్యూసర్స్ ఇంకా డైరెక్టర్ వేణుఉడుగులను తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. రవన్న లాంటి పాత్రలో నటించినందుకుగాను రానాను ప్రత్యేకంగా అభినందించాలి.. ఇంకా సాయి పల్లవి చాలా బాగా చేసింది అని ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా ఈసినిమాలో నివేతా పేతురాజ్, ప్రియమణి, నందితా దాస్‌, నవీన్ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రలు పోషించారు. బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్‌, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి ఇతర పాత్రల్లో నటించారు. విరాటపర్వం మూవీకి సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 7 =