లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అర్జున్ , మధుబాల జంటగా తెరకెక్కిన జెంటిల్ మెన్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. జెంటిల్ మెన్ సినిమాను నిర్మించిన కుంజుమోన్ జెంటిల్ మెన్ 2 సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు కూడా. ప్రస్తుతం అయితే ఈసినిమాకు కాస్టింగ్ కు సంబంధించిన ఎంపిక జరుగుతుంది. ఒక్కొక్కరినీ ఎంపిక చేస్తూ అధికారికంగా తెలియచేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో నటించే హీరోయిన్లను, డైరెక్టర్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో హీరోయిన్లుగా మాలీవుడ్ బ్యూటీ నయనతార చక్రవర్తి, మరో హీరోయిన్ గా యంగ్ నటి ప్రియా లాల్ ను ఫిక్స్ చేశారు. గోకుల్ కృష్ణ అనే డైరెక్టర్ ను ఈసినిమాను డైరెక్ట్ చేయడానికి ఫిక్స్ చేశారు. ఇప్పుడు తాజాగా సినిమాటోగ్రాఫర్ ను ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అజయన్ విన్సెట్ ను సినిమాటోగ్రాఫర్ గా ఫిక్స్ చేశార. అజయన్ విన్సెట్ తమిళ్ తోపాటు తెలుగులో కూడా పలు సినిమాలకు పనిచేశారు. చెన్నకేశవ రెడ్డి, వంశీ, రుద్రమదేవి 3డి, ఓం 3డి వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు.
కాగా ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో నిర్మించనున్నారు కుంజుమోన్. ఇక ఈసినిమాకు ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిచనున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: