మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ మూవీ లో హీరో నాని తన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.సంప్రదాయ బ్రాహ్మణ కుర్రాడిగా నటించి ఆ పాత్రకి న్యాయం చేశారు.నజ్రియా నజీమ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అంటే సుందరానికీ !” మూవీ ఓవర్సీస్ వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. “అంటే .. సుందరానికీ !” మూవీ ఫస్ట్ వీక్ పూర్తయ్యే సరికి వరల్డ్ వైడ్‌గా రూ.18.39 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టగా, రూ.32.60 కోట్లు గ్రాస్ వచ్చింది. హీరో నాని తన ఫ్యామిలీ తో వెకేషన్ కు గోవా వెళ్ళారు. గోవా లో కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన తరువాత నాని తిరిగి”దసరా”మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: