తాప్సీ ప్రధాన పాత్రలో భారత మహిళా వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ బయోపిక్ లో మిథాలీ జీవితానికి సంబంధించి.. తన క్రికెట్ ఆరంగేట్రం గురించి ఎన్నో కీలకమైన అంశాలను చూపించనున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం అయితే రిలీజ్ కు సిద్దమవుతుంది. జులై 15వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. “మెన్ ఇన్ బ్లూ మాదిరిగానే మనకి కూడా ఉమెన్ ఇన్ బ్లూ అనే ఓ టీమ్ ఉంటే బాగుంటుందని ఎనిమిదేళ్ల వయసు నుంచి కలలు కంటున్నాను” అని తాప్సీ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక, మిథాలీ రాజ్‌గా తాప్సీ నటన అదరగొట్టేసింది. మొత్తానికి ట్రైలర్ లో చిన్నప్పటి నుండీ క్రికెటర్ కావాలని కలలు కన్న మిథాలీ.. ఆ క్రమంలో ఆమె ఎదుర్కున్న అవమానాలు.. ఆటలో ఎత్తు పల్లాలు.. ఇంకా ఆమె కెరీర్ కు సంబంధించిన విషయాలను ట్రైలర్ లో చూపించారు.
A tale of one of the Greatest Of All Times in the world of cricket!
The Legendary Mithali Raj!
Witness the story of her spirit, her passion, her courage, and her dreams!https://t.co/4wUXKHsBPz#ShabaashMithuTrailer #GirlWhoChangedTheGame pic.twitter.com/zq5Uc1CiW2— Viacom18 (@viacom18) June 20, 2022
కాగా మిథాలీ రాజ్ 1999లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ తో అరంగేట్రం చేసింది. తన 19 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 214 పరుగులు చేసి..అతి చిన్న వయసులో టెస్టుల్లో 200 పరుగులు చేసిన క్రికెటర్ గా అరుదైన గుర్తింపు సాధించారు. 23 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మిథాలీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారు. మిథాలీ భారత్ తరఫున 12 టెస్టులు, 230 వన్డేలు, 89 టీ20లు ఆడారు. టెస్టులలో 669, వన్డేలలో 7737, టీ20లలో 2364 పరుగులు చేశారు. మొత్తంగా 8 సెంచరీలు చేశారు. ఇటీవలే అంతర్జాతీయ కెరీర్ నుంచి మిథాలీ రిటైరైంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: