‘భారతీయుడు 2’ పై కమల్ మరోసారి క్లారిటీ..!

Kamal Haasan Gives Clarity about Bharateeyudu 2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bharateeyudu 2,Bharateeyudu 2 Movie,Bharateeyudu 2 Telugu Movie,Bharateeyudu 2 Movie Updates,Bharateeyudu 2 Movie Updates,Kamal Haasan Bharateeyudu 2 Movie, Kamal Haasan,Kamal Haasan Bharateeyudu 2 Movie,Kamal Haasan Clarity on Bharateeyudu 2 Movie,Kamal Haasan About Bharateeyudu 2 Movie,

స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భారతీయుడు. 1996 లో వచ్చిన ఈసినిమా అప్పట్లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ చరిత్రలోనే ఈసినిమా కూడా ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోతుంది. ఇక ఈసినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా. అయితే ఈసినిమాను ఎప్పుడైతే మొదులుపెట్టారో అప్పటినుండీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. షూటింగ్ ప్రారంభించిన కొద్ది రోజులకే కమల్ కు ఆరోగ్య సమస్యలు రావడంతో ఆతరువాత ఎలక్షన్స్ అంటూ.. ఆ తరువాత క్రేన్ ప్రమాదం జరగడం ఇలా పలు ప్రాబ్లమ్స్ రావడంతో షూటింగ్ కు గ్యాప్ వచ్చింది. ఆ తరువాత ఏకంగా లైకాతోనే వివాాదాలు వచ్చాయి. ఈ సినిమా పెండింగ్ లో ఉండగానే శంకర్ చరణ్ తో సినిమాను మొదలుపెట్టడంతో లైకా కేసు కూడా వేసింది. ప్రస్తుతం అయితే ఈ వివాాదాలన్నీ ముగిసిపోయాయనుకోండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఎప్పుడు మొదలవుతుందో అన్నది మాత్రం ఇప్పటివరకూ సమాధానం లేని ప్రశ్న. అయితే తాజాగా ఈసినిమాపై స్పందించిన కమల్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈసినిమా ఆగిపోలేదని ఖచ్చితంగా మళ్లీ రీస్టార్ట్ చేస్తామని చెప్పారు. శంకర్ తో పాటు మేము కూడా ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. లైకా తో ప్రొడక్షన్స్ తో చర్చలు జరుపుతూనే ఉన్నాము.. శంకర్ ప్రస్తుతం చరణ్ తో సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా అయిపోయిన తరువాత మా సినిమానే మొదలుపెడతామని స్పష్టం చేశారు. మరి వచ్చే ఏడాది ఈసినిమా మళ్లీ పట్టాలెక్కేఅవకాశం కనిపిస్తుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.