ప్రేమకథా చిత్రమ్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్

Prema Katha Chitram 2 Movie Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Prema Katha Chitram 2 Movie Updates,Prema Katha Chitram 2 Telugu Movie Latest News,Prema Katha Chitram 2 Movie Release Date Locked,Prema Katha Chitram 2 Telugu Movie Release Date Confirmed
Prema Katha Chitram 2 Movie Release Date Locked

మారుతి దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు, నందిత జంటగా 2013లో వచ్చిన హారర్ కామెడీ ప్రేమకథా చిత్రమ్ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ప్రేమకథా చిత్రమ్ -2 బ్యాక్ టు ఫియర్ అనే క్యాప్షన్ తో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సీక్వెల్ పై కూడా అంచనాలు బాగానే ఏర్పడ్డాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నిన్నటి వరకూ మార్చిలోనే ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 6 వ తేదీన ప్రేమ కథా చిత్రమ్ 2 ను రిలీజ్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

కాగా నందితా శ్వేత కథానాయికగా నూతన దర్శకుడు హరి కిషన్ దర్శకత్వం లో రూపొందుతున్న ప్రేమ కథాచిత్రమ్ 2మూవీలో సుమంత్ అశ్వి న్, సిద్ది ఇద్నాని లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో విధ్యులేఖ‌, ప్ర‌భాస్ శ్రీను, కృష్ణ తేజ‌ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. జె.బి సంగీతం అందిస్తున్నారు. ఆర్ సుదర్శన్ రెడ్డి నిర్మాణ సారధ్యం లో ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి ప్రేమకథా చిత్రమ్ మంచి సక్సెస్ సాధించింది.. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుందో..ఎంతవరకూ భయపెడతారో చూద్దాం..!

[subscribe]

[youtube_video videoid=pj8VXrd-3zw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.