మరోసారి కూలీ నెం.1 రీమేక్ ప్లాన్!

Venkatesh Super Hit Movie To Be Remade In Bollywood Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Coolie No. 1 Movie Updates,Coolie No. 1 Telugu Movie Latest News,Victory Venkatesh Coolie No. 1 Super Hit Movie To Be Remade In Bollywood Again
Venkatesh Super Hit Movie To Be Remade In Bollywood Again

వెంకటేష్, టబు హీరో హీరోయిన్లుగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1991 లో వచ్చిన కూలీ నెం. 1 సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇక ఈ సినిమాను అప్పట్లో బాలీవుడ్ లో కూడా రీమేక్ చేశారు. హిందీలో గోవింద, కరిష్మా కపూర్ లను హీరో హీరోయిన్లుగా పెట్టి డేవిడ్ దావన్ ఈ సినిమాను 1995 రీమేక్ చేయగా.. అక్కడ కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మళ్లీ ఈ సినిమాను మరోసారి రీమేక్ చేయనున్నారట. మళ్లీ డేవిడ్ దావనే ఈసినిమాను రీమేక్ చేయనున్నారట. అయితే ఈసారి తన కొడుకు, బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ థావన్ తో ఈ రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. హీరోయిన్ గా సారా అలీ ఖాన్ ను తీసుకోనున్నట్టు తెలుస్తోంది. వరుణ్ దావన్ బ్రదర్ రోహిత్ దావన్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుపుతున్నారు. మరి తెలుగులో, హిందీలో కూడా సూపర్ హిట్ అయిన ఈ సినిమాను మరోసారి రీమేక్ అంటున్నారు. మరి ఇప్పుడు ఈ స్టోరీ అందరికీ కనెక్ట్ అవుతుందో లేదో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=3K3qNc2Ww-4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.