హార‌ర్ కామెడీ సినిమాలో జాన్వీ క‌పూర్‌

Janhvi Kapoor To Act In A Horror Comedy Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Janhvi Kapoor Latest News,Janhvi Kapoor Upcoming Movie News,Janhvi Kapoor New Movie Updates,Janhvi Kapoor Next Film News,Janhvi Kapoor Upcoming Project Details

`అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి త‌న‌య` అనే ట్యాగ్‌తో బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ క‌పూర్‌. తొలి చిత్రం `ధ‌డ‌క్‌`తో న‌టిగా మెప్పించిన జాన్వి… ప్రస్తుతం `కార్గిల్ గాళ్‌`, `త‌ఖ్త్‌` చిత్రాల‌తో బిజీగా ఉంది. బాలీవుడ్ స‌మాచారం ప్రకారం… ఈ టాలెంటెడ్ బ్యూటీ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రానికి సంత‌కం చేసింద‌ని తెలిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… గ‌త ఏడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన హార‌ర్ కామెడీ మూవీ `స్త్రీ` లో హీరోగా న‌టించిన రాజ్ కుమార్ రావ్ `రూహ్ అఫ్‌జా` అనే మ‌రో హార‌ర్ కామెడీ ఫిల్మ్‌లో న‌టిస్తున్నాడు. కొత్త పెళ్ళికొడుకుల‌ను త‌న పాట‌ల‌తో నిద్ర‌పుచ్చి… పెళ్ళి కూతుళ్ళ‌ను ఆవ‌హించే ఓ దెయ్యం క‌థ‌గా `రూహ్ అఫ్‌జా` తెర‌కెక్కుతోంది. కాగా… ఇందులో క‌థానాయికగా న‌టించేందుకు జాన్వి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని బాలీవుడ్ టాక్‌. మ‌రి.. తొలి హార‌ర్ కామెడీ ఫిల్మ్‌లో జాన్వి ఏ స్థాయిలో అల‌రిస్తుందో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =