నాగార్జున `విక్కీదాదా`కి 30 ఏళ్ళు

30 Years For Nagarjuna Super Hit Movie Vikkidada, 30 Years For Nagarjuna Vikkidada Telugu Movie, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Vikkidada Movie Completed 30 Years, Vikkidada Movie Updates, Vikkidada Telugu Movie Latest News
30 Years For Nagarjuna Super Hit Movie Vikkidada

కింగ్ నాగార్జున – కామాక్షి మూవీస్ అధినేత డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి కాంబినేష‌న్‌లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు వ‌చ్చాయి. వాటిలో `విక్కీ దాదా` ఒక‌టి. నాగార్జున‌కి క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుల‌లో ఒక‌రైన ఎ.కోదండ‌రామిరెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. నాగ్‌కి జోడీగా జూహీ చావ్లా, రాధ న‌టించిన ఈ చిత్రంలో క‌న్న‌డ ప్ర‌భాక‌ర్‌, గొల్ల‌పూడి మారుతి రావు, గిరి బాబు, రంగ‌నాథ్‌, కోట శ్రీ‌నివాస‌రావు, శ్రీ‌విద్య‌, వ‌ర‌ల‌క్ష్మి, క‌ల్ప‌నా రాయ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. యండ‌మూరి వీరేంధ్ర‌నాథ్ క‌థ‌ను అందించిన ఈ చిత్రానికి ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ స్క్రీన్ ప్లే ని, గ‌ణేష్ పాత్రో సంభాష‌ణ‌ల‌ను అందించారు. రాజ్ – కోటి బాణీల‌కు వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి సాహిత్య‌మందించారు. ఈ సినిమాలోని పాట‌ల‌న్నీ ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా… `ఓ బేబి నీ మీద బెంగ ప‌డ్డా` పాట అయితే అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. 1989 మార్చి 11న విడుద‌లైన `విక్కీ దాదా` నేటితో 30 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − twelve =