`హలో` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కేరళకుట్టి కళ్యాణి ప్రియదర్శన్. మొదటి సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా… నటిగా మంచి గుర్తింపునే తెచ్చుకుంది కళ్యాణి. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలుపుకుని మొత్తం ఐదు చిత్రాలతో బిజీగా ఉంది. వీటిలో రెండు తెలుగు చిత్రాలు ఉండడం విశేషం. అందులో ఒకటి… మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న `చిత్రలహరి` కాగా… మరొకటి టాలెంటెడ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న పేరు నిర్ణయించని సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ రెండు చిత్రాలూ వేసవిలోనే తెరపైకి రానున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న `చిత్రలహరి` ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా…. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న శర్వానంద్ చిత్రం మే నెలలో సెల్యులాయిడ్ పైకి రానుంది. మరి… తక్కువ గ్యాప్‌లోనే వస్తున్న ఈ చిత్రాలతో కళ్యాణికి మంచి విజయాలు దక్కుతాయేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: