`సవ్యసాచి` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది నిధి అగర్వాల్. ఆ తరువాత `మిస్టర్ మజ్ను`లోనూ కనువిందు చేసింది. తొలి, మలి సినిమాల్లో అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్‌తో సందడి చేసి అలరించిన నిధి… ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్‌కి జోడీగా `ఇస్మార్ట్ శంకర్`లో నటిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సైంటిస్ట్ పాత్రలో దర్శనమివ్వనుంది నిధి. వేసవి కానుకగా మే నెలలో ఈ సినిమా తెరపైకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… మరో ఆసక్తికరమైన చిత్రంలో నటించేందుకు నిధి అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే… బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా స్టువర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. వంశీకృష్ణ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఓ హీరోయిన్ గా పాయల్ రాజ్‌పుత్ ఎంపిక కాగా… మరో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ సెలెక్ట్ అయిందని సమాచారం. త్వరలోనే నిధి ఎంట్రీపై క్లారిటీ రావచ్చు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: