సూపర్ స్టార్ రజనీ కాంత్… వరుస సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ పెంచుతున్నాడు. తాజాగా కేవలం ఎనిమిది నెలల గ్యాప్‌లోనే `కాలా`, `2.0`, `పేట` చిత్రాలతో పలకరించి… ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. ఇదే ఊపులో… తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడీ సూపర్ స్టార్. బ్రిలియంట్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రజనీ డబుల్ రోల్‌లో సందడి చేయబోతున్నాడు. అందులో ఒకటి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ రోల్ కాగా… మరొకటి సోషల్ వర్కర్ రోల్ అని టాక్. అలాగే… రజనీకి జోడీగా నయనతార, కీర్తి సురేష్ నటించబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… కోలీవుడ్ సమాచారం ప్రకారం రజనీ, మురుగదాస్ కాంబిననేషన్ మూవీ ముంబై నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. గతంలో ఇదే నేపథ్యంలో రజనీ నటించిన `బాషా`, తాజా చిత్రం `పేట` అభిమానులను విశేషంగా అలరించిన నేపథ్యంలో… కొత్త చిత్రం కూడా మురిపిస్తుందేమో చూడాలి. ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ… ఏడాది చివరిలో తెరపైకి రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: