సినీ కెరీర్ ప్రారంభంలోనే మంచి విజయాలను అందుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆ తరువాత వరుస అపజయాలతో కాస్త వెనకబడ్డాడు. చాలా కాలం నుండి ఒక్క సినిమా కూడా తీయకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్న తరువాత మళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే గతంలో చేసినట్టు కాకుండా.. ఈసారి ఆచితూచి ముందడుగు వేయాలని భావిస్తున్న రాజ్ తరుణ్ కథల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే రానా, అక్షయ్ కుమార్ ప్రారంభించబోయే జాయింట్ ప్రొడక్షన్ వెంచర్ లో తెలుగు, హిందీ భాషల్లో ఒక సినిమా నిర్మాణాన్ని చేపట్టబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్, టాలీవుడ్ లో తెరకెక్కబోయే ఆ సినిమా కోసం బాలీవుడ్ లో ఇంకా హీరో ఎవరో తెలియదు కానీ.. తెలుగులో ఈ సినిమా కోసం రానా రాజ్ తరుణ్ ని సెలక్ట్ చేసినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.
ఇప్పుడు తాజాగా రాజ్ తరుణ్ మరో లక్కీ ఛాన్స్ కొట్టేశాడంటున్నారు. త్వరలో ఈ యంగ్ హీరో ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి సినిమా చేయబోతున్నాడట. ఇటీవల ఓ టర్కిష్ సినిమా చూసిన రాజ్ తరుణ్ అది నచ్చడంతో దిల్ రాజు ను కలిసి రీమేక్ చేస్తే బావుంటుందని చెప్పాడట. ఇక సినిమా చూసిన దిల్ రాజుకు కూడా సినిమా నచ్చడంతో ఓకే చెప్పారట. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లోనే ఈసినిమాను తీయనున్నారట. అంతేకాదు ఈ సినిమా కోసం రాజ్ తరుణ్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవట్లేదట. సినిమా కనుక బాక్సాఫీసు వద్ద బాగా ఆడితే అందులో కొంత భాగం అతడికి చెల్లించేలా డీల్ ఓకే అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. మరి దిల్ రాజు అంచనాలు తప్పవనే నమ్మకం ఉంది.. ఈ సినిమా దిల్ రాజుకు కూడా నచ్చిందంటే మ్యాటరుండే ఉంటుంది. చూద్దాం మరి ఈ సినిమా అయినా రాజ్ తరుణ్ కు కలిసొస్తుందో?లేదో?
[youtube_video videoid=67IogzBKdtc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: