వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. అటు మహేష్ అభిమానులే కాదు.. ప్రతి సినీ ప్రేక్షకుడు మోస్ట్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్న సినిమా మహర్షి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి క్లారిటీ ఇచ్చేశారు చిత్ర యూనిట్. ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత కొద్ది కాలంగా ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుండగా తాజాగా మరో షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. కొద్ది రోజులుగా మహర్షి టీమ్ చెన్నై లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పుడు ఆ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నమ్రత స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపింది.
View this post on Instagram
And it’s a wrap!! Quick and fun schedule with the team and friends at Chennai. #OnLocation #Maharshi
కాగా ఈ సినిమాలో మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల స్పీడు పెంచారు చిత్ర యూనిట్. ఇటీవలే ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభించాడు దర్శకుడు వంశీ. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తిచేసి మే 9 న రిలీజ్ చేయనున్నారు.
[youtube_video videoid=Brd1RdYsiR0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: