`118` విజయం… నందమూరి కళ్యాణ్ రామ్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలో… మరింత జోష్‌తో తన తదుపరి చిత్రాలకు సన్నధ్ధమవుతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. వినిపిస్తున్న కథనాల ప్రకారం… కళ్యాణ్ రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ డైరెక్షన్‌లో ఉంటుందని టాలీవుడ్ టాక్. అంతేకాదు… ఈ సినిమాని తన సొంత సంస్థ యన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ పై నిర్మించే అవకాశముందని సమాచారం. కాగా… సోషియో ఫాంటసీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకి `తుగ్లక్` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అలాగే అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ఉంటుందని టాక్. ఈ నెలలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రారంభోత్సవం జరుగుతుందని ఫిల్మ్‌నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ఈ చిత్రంతో పాటు శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మరో చిత్రం చేసేందుకు కళ్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే ఈ మూడు చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: