రవితేజ అంటే ఎంటర్‌టైన్‌మెంట్… ఎంటర్‌టైన్‌మెంట్ అంటే రవితేజ… ఇదీ రవితేజ అభిమానుల మాట. జయాపజయాలకు అతీతంగా వరుస సినిమాలతో సందడి చేసే నైజం ఈ మాస్ మహరాజా సొంతం. `రాజా ది గ్రేట్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన ఈ ఎవర్‌గ్రీన్ ఎనర్జిటిక్ స్టార్… గత ఏడాది మూడు చిత్రాలతో సందడి చేశాడు. `టచ్ చేసి చూడు`, `నేల టిక్కెట్టు`, `అమర్ అక్బర్ ఆంటొని` పేర్లతో విడుదలైన ఆ సినిమాలు నిరాశపరిచినా… రవితేజ మాత్రం తన అభిమానులను మురిపించాడు. కాగా… ఈ ఏడాది కూడా రవితేజ తన దూకుడును కొనసాగించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే వీఐ ఆనంద్ దర్శకత్వంలో సైంటిఫిక్ ఫిక్షన్ `డిస్కో రాజా` చేస్తున్న రవితేజ… ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమాతో పలకరించనున్నాడు. అలాగే తమిళ బ్లాక్‌బస్టర్ `తెరి`కి రీమేక్‌గా సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రాన్ని కూడా ఏప్రిల్ రెండో వారంలో ప్రారంభించి… ఈ ఏడాది దసరాకి సందడి చేయనున్నాడట. `డిస్కో రాజా`లో పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తుండగా… `తెరి` రీమేక్‌లో కేథరిన్ ట్రెసా నటించబోతోంది. మరి… ఈ రెండు సినినమాలతో రవితేజ తన స్థాయి విజయాలను అందుకుంటాడేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: