అనుష్క… తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఓ వైపు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో మెప్పిస్తూనే… మరో వైపు అగ్ర కథానాయకుల చిత్రాల్లోనూ కనువిందు చేస్తుంటుంది. అలాగే అతిథి పాత్రల్లోనూ, కీలక పాత్రల్లోనూ మురిపిస్తుంటుంది. ప్రస్తుతం `సైలెన్స్` అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్న అనుష్క… తాజాగా ఓ ఆసక్తికరమైన చిత్రంలో కీలక పాత్ర పోషించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు సంతోష్ శివన్… అయ్యప్ప స్వామి జీవితం ఆధారంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ త్రిభాషా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. యువ రాజుగా, యోధుడిగా అయ్యప్ప లోని కోణాన్నిఆవిష్కరించేలా ఈ సినిమా ఉంటుందట. కాగా… ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అనుష్క దర్శనమివ్వనుందని సమాచారం. అదే గనుక నిజమైతే… `ఓం నమో వెంకటేశాయ` తరువాత స్వీటీ నటించే ఆధ్యాత్మిక చిత్రం ఇదే అవుతుంది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందించనున్న ఈ సినిమాని శ్రీ గోకులన్ గోపాలన్ నిర్మించనున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: