`బాయ్స్‌`కి సీక్వెల్ రానుందా?

Actor Siddharth Boys Telugu Movie Sequel On Cards, Boys Movie Updates, Boys Telugu Movie Latest News, Latest Telugu Movies News, Siddharth Boys Movie Sequel On Cards, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Siddharth Boys Movie Sequel On Cards

ద‌క్షిణాది సినిమాకి కొత్త న‌డ‌క‌లు నేర్పించిన ద‌ర్శ‌కుల‌లో శంక‌ర్ ఒక‌డు. తొలి చిత్రం `జెంటిల్ మేన్‌` నుంచి తాజాగా విడుద‌లైన `2.0` వ‌ర‌కు ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన ఘ‌న‌త శంక‌ర్‌ది. అంతేకాదు… సంగీతం ప‌రంగానూ, సాంకేతికంగానూ ఆయ‌న సినిమాలు ఉన్నతంగా ఉండి అల‌రించాయి. కాగా… యువ‌త‌రాన్ని లక్ష్యంగా చేసుకుని తెర‌కెక్కించిన యూత్‌ఫుల్ మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ `బాయ్స్‌` అయితే అప్ప‌ట్లో ఓ సెన్సేష‌న్‌. ఈ సినిమా ద్వారానే సిద్ధార్థ్‌, జెనీలియా హీరోహీరోయిన్లుగా తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. అలాగే… నేటి సంచ‌ల‌న సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ కూడా ఇందులో ఓ ప్ర‌ధాన పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క‌ట్ చేస్తే… ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ రాబోతోంద‌ని కోలీవుడ్ టాక్‌. సిద్ధార్థ్‌, త‌మ‌న్ ఈ చిత్రంలోనూ కొన‌సాగుతార‌ట‌. అయితే… ఈ సినిమాకి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడా? లేదంటే ఆయ‌న శిష్యుడు ఎవ‌రైనా టేక‌ప్ చేస్తాడా? అన్న‌ది తెలియాల్సి ఉంది. వాస్త‌వానికి… మూడేళ్ళ క్రిత‌మే ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే… ఏవేవో కార‌ణాల వ‌ల్ల అది కార్య‌రూపం దాల్చ‌లేదు. మ‌రి… ఈ సారైనా `బాయ్స్‌` సీక్వెల్ ప్లాన్ అమ‌లులోకి వ‌స్తుందేమో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =