కామెడీ, యాక్షన్, కుటుంబ కథా చిత్రాలతో ఇన్ని రోజులు ప్రేక్షకులను అలరించిన మంచు విష్ణు ఇప్పుడు కొత్తగా పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమాతో వస్తున్నాడు. జి.ఎస్.కార్తిక్ దర్శకత్వంలో వస్తున్న ఓటర్ అనే సినిమాలో విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మంచు విష్ణు కెరీర్ లోన్ తొలిసారిగా నటిస్తున్న పొలిటికల్ డ్రామా ఇది. ఇక గత కొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు (మార్చి 12) వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
కాగా ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా సురభి నటిస్తుండగా… సంపత్ రాజ్, నాజర్, పోసాని కృష్ణమురళి, ప్రగతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జాన్‌సుధీర్ పూదోట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: రాజేష్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ తనమల. ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
మరి ఓటు వాల్యూ చెబుతూ ఈ సినిమాను తీస్తున్నారు. ఎలక్షన్ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై బాగానే ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా నేటి ఓటర్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం.
[youtube_video videoid=7GKvSkGnzzc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: