ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 23
ఒకే సీజన్‌లో వస్తున్న రజినీ, ధనుష్
తండ్రీకొడుకులుగా ప్రభాస్?
విజయ్ చందర్ కు కీలక పదవి
'అల వైకుంఠపురములో' డబ్బింగ్ మొదలైంది
'ఆకాశం నీ హద్దురా' అంటున్న సూర్య
విక్రమ్ ను అలా ఎందుకు అంటారో అర్థమైంది

RGV డబల్ ధమాకా

టెర్రరిస్ట్ గా సమంత..!
విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ?

'ఫ్రోజెన్ 2' - సితార కు లక్కీ ఛాన్స్
నవంబర్ 18 వ తేదీ ఉపేంద్ర "కబ్జ"మూవీ ప్రారంభం
అల్లు అర్జున్ కు బాస్ గా పూజ హెగ్డే
షూటింగ్ ప్రారంభమైన జయలలిత బయోపిక్ మూవీ
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘సైకో’
‘తుప్పరివాలన్’(తెలుగులో ‘డిటెక్టివ్’) వంటి సక్సెస్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ తరువాత దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సైకో’. ఇందులో నిత్యా మీనన్, అదితీరావు హైదరి, ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్ అంధుడి పాత్రలో కనిపించనుండగా... అదితిరావు హైదరి రేడియో జాకీగా దర్శనమివ్వనుంది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.
ఒకే సీజన్‌లో వస్తున్న రజినీ, ధనుష్
తమిళనాట 2020 సంక్రాంతి రసవత్తరంగా మారింది. ఎందుకంటే... నిజజీవితంలో మామాఅల్లుళ్ళు అయిన ఇద్దరు అగ్ర కథానాయకులు... పొంగల్ సీజన్‌లో తమ తమ కొత్త సినిమాలతో బాక్సాఫీస్ వద్ద క్లాష్ కి సై అంటున్నారు. ఆ మామాఅల్లుళ్ళు మరెవరో కాదు... సూపర్ స్టార్ రజినీకాంత్, టాలెంటెడ్ యాక్టర్ ధనుష్.
తండ్రీకొడుకులుగా ప్రభాస్?
`బాహుబలి` సిరీస్‌లో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా రెండు విభిన్న పాత్రల్లో నటించి అలరించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తండ్రీకొడుకుల పాత్రల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించి మరీ బ్లాక్‌బస్టర్స్ అందుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో. కట్ చేస్తే... తన అప్ కమింగ్ ఫిల్మ్‌లోనూ ఇదే ఫీట్ ని రిపీట్ చేయబోతున్నాడట ప్రభాస్.
ఈసారి పవన్ కళ్యాణ్ టైటిల్ తో రాబోతున్న కార్తి?
`ఖైదీ` ఘనవిజయం తమిళ కథానాయకుడు కార్తిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. తమిళ, తెలుగు భాషల్లో ఒకే రోజున విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్‌తో... మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు కార్తి. ఈ నేపథ్యంలో... తక్కువ గ్యాప్‌లోనే కొత్త చిత్రంతో పలకరించబోతున్నాడీ టాలెంటెడ్ స్టార్. ఫ్యామిలీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.
అల్లు అర్జున్ నోట జానపద పాట?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోమారు గాయకుడిగా పలకరించబోతున్నాడు. అప్పుడెప్పుడో `వేదం`(2010) కోసం `ప్రపంచం నా వెంట వస్తుంటే` అంటూ సాగే వెస్ట్రన్ టచ్ ఉన్న రొమాంటిక్ సాంగ్ లో తన గొంతుని సవరించిన బన్నీ... త్వరలో ఓ జానపద గీతాన్ని తన నోట వినిపించబోతున్నాడట.
విజయ్ చందర్ కు కీలక పదవి
వైసీపీ కోసం పని చేసిన సెలెబ్రిటీలకు జగన్ ప్రభుత్వంలో పలు కీలక పదవులు దక్కిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, పృథ్వీ, అలీ, పోసాని కృష్ణమురళి సహా ఈ జాబితాలో చాలా మంది ఉన్నారు. పృథ్వీకి ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పదవి ఇవ్వగా ఈ జాబితాలో సీనియర్ నటుడు విజయ్ చందర్ కూడా చేరిపోయాడు.
లిడో డాన్సర్స్‌తో డాన్స్ - ఫస్ట్ సౌత్ఇండియన్ స్టార్‌గా మరో రికార్డ్
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ సామజవరగమనా సాంగ్ షూటింగ్ కోసం యూరప్‌లో వున్నసంగతి కూడా విదితమే. అయితే అక్కడ అల్లు అర్జున్ లిడో డాన్సర్స్‌తో కలిసి స్టెప్పులేసాడట. అంతేకాదు గత 25 సంవత్సరాలుగా ఎంతో ఫేమస్ అయిన లిడో డాన్స్‌ని బన్నీ చేయడంతో తాజాగా ఆయన ఖాతాలో మరో రికార్డ్ నమోదైంది. ఫస్ట్ టైమ్ పారిస్‌లో లిడో డాన్సర్స్‌తో డాన్స్ చేసిన సౌత్ఇండియన్ స్టార్‌గా రికార్డ్ క్రియేట్ చేసాడు.
'అల వైకుంఠపురములో' డబ్బింగ్ మొదలైంది
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' పాటలు రిలీజ్ చేయగా వాటికీ ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూ ట్యూబ్ లో ఈ రెండు పాటలు మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా చెప్పేసారు. సంక్రాంతి పండుగా సందర్భంగా జనవరి 12 వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
'ఆకాశం నీ హద్దురా' అంటున్న సూర్య
సినిమా హిట్లు ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఇటీవలే 'కాప్పాన్' తెలుగులో 'బందోబస్త్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య మరో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ (అసాధారణ కలలు కన్న సాధారణ వ్యక్తి కథ)టైటిల్‌తో విడుదల కానుంది.
విక్రమ్ ను అలా ఎందుకు అంటారో అర్థమైంది
క్రికెట్ తో పాటు పలువురు క్రికెటర్లు అప్పుడప్పుడు వెండి తెరపై కూడా సందడి చేశారు. ఇప్పటికే శ్రీశాంత్, అజయ్ జడేజా వెండి తెరపై మెరవగా.. ఇప్పుడు వారి జాబితాలో ఇర్ఫాన్ పఠాన్ కూడా చేరిపోయాడు. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో స్టార్ హీరో చియాన్ విక్రమ్ 58వ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాలో పఠాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పఠాన్ తన షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ చిత్రంలో టర్కీ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తమిళ్ రీమేక్ లో కమెడియన్..!
అదృష్టం ఉండాలే కానీ చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్లు కొడతాయి. ఇప్పటికే ఇది పలు సినిమాల్లో రుజువైంది కూడా. అలా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమాతో క్యారెక్టర్ నటుడు నవీన్ పొలిశెట్టి హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే అశ్వనీదత్ కుమార్తె స్వప్న నిర్మించనున్న సినిమాలో నవీన్ నటించేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నిర్మాతలు కూడా నవీన్ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్టుగా…

RGV డబల్ ధమాకా
సంచలనాలకు మారుపేరైన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరో సంచలానికి తెర తీశారు. వారం రోజుల గ్యాప్ లో రెండు సినిమాలకు రిలీజ్ డేట్స్ ప్రకటించారు. టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన కమ్మరాజ్యం లో కడప రెడ్లు, బ్యూటిఫుల్ మూవీస్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు మూవీస్ కు రవిశంకర్ సంగీతం అందించారు.

టెర్రరిస్ట్ గా సమంత..!
మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్'. స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ విశేష ప్రజాదరణ పొందింది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే.
విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR మూవీ షూటింగ్ తో, నిర్మాతగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. RRR మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత తాను నటించే మూవీ కై రామ్ చరణ్ స్క్రిప్ట్స్ వింటున్నారు. రామ్ చరణ్ RRR మూవీ తరువాత నటించే మూవీ ని ఓకే చేసినట్టు సమాచారం.

'ఫ్రోజెన్ 2' - సితార కు లక్కీ ఛాన్స్
డిస్ని రూపొందించిన యానిమేషన్ మూవీ 'ఫ్రోజెన్' 2013లో విడుదలైన ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటేడ్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సంవత్సరం ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డును గెలుచుకొన్నది.ఇక దీనిలో భాగంగానే ఫ్రొజెన్ 2 ను తీసుకురానున్నారు. ఈ చిత్రం నవంబర్ 22 తేదీన ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నది.
నవంబర్ 18 వ తేదీ ఉపేంద్ర "కబ్జ"మూవీ ప్రారంభం
దేశ వ్యాప్తంగా అభిమానులున్న నటుడు, నిర్మాత, దర్శకుడు ఉపేంద్ర ఒక కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్. చంద్రు దర్శకత్వంలో శాండల్ వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా అండర్ వరల్డ్ నేపథ్యం లో రూపొందనున్న మాస్ ఎంటర్ టైనర్ కబ్జ మూవీ షూటింగ్ నవంబర్ 18 వ తేదీ ప్రారంభం కానుంది. బెంగుళూరు, ముంబై, మధురై , మంగుళూరు లలో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకోనుంది.
అల్లు అర్జున్ కు బాస్ గా పూజ హెగ్డే
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న అల ... వైకుంఠపురములో మూవీ సాంగ్ సామజవరగమన ప్యారిస్ లోని సుందర లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్ టబు, యంగ్ హీరో సుశాంత్, నివేత పేతురాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. థమన్ S సంగీతం అందించారు. ఈ మూవీ లోని రెండు సాంగ్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
'పొన్నియన్ సెల్వన్' ప్రారంభానికి ముహూర్తం ఖరారు
ప్రముఖ నవలారచయిత కల్కీ రాసిన నవల ఆధారంగా మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' అనే సినిమా తీస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వార్తలైతే వచ్చాయి కానీ ఇంత వరకూ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. తమిళ్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడంతో మణిరత్నం కూడా ఈ సినిమాలో నటించే నటీమణులను కూడా అంతే ప్రముఖులను సెలెక్ట్ చేసాడు. యువ స్టార్స్ నుంచి సూపర్‌స్టార్స్ వరకు పొన్నియన్ సెల్వన్ చిత్రంలో భాగం కాబోతున్నారు.

అల్లు అరవింద్ చేతిలో సూర్య-జ్యోతిక సినిమా హక్కులు
టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ మధ్య పలు రీమేక్ సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నాడు. తెలుగులో నాని హీరోగా వచ్చి భారీ సక్సెస్ సాధించిన జెర్సీ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. దీనితో పాటు తాజాగా మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పీరియడ్ డ్రామా మమాంగం సినిమా తెలుగు రైట్స్ కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ను గత వరం రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్…
షూటింగ్ ప్రారంభమైన జయలలిత బయోపిక్ మూవీ
తమిళ నాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ మూవీ "తలైవి " షూటింగ్ చెన్నై లో 10వ తేదీ ప్రారంభమయింది. AL విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలిత పాత్ర లో నటిస్తుండగా, MGR పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు . పలువురు ప్రముఖ నటీనటులు తలైవి మూవీ లో ముఖ్య పాత్రలలో నటించనున్నారు. GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.