విక్రమ్ ను అలా ఎందుకు అంటారో అర్థమైంది

Cricketer Irfan Pathan Hails Hero Vikram,Cricketer Irfan Pathan in Vikram 58th movie, famous Indian pace bowler Irfan Pathan, latest telugu movies news, Tamil star Vikram 58th movie, Telugu Film News 2019, Telugu Filmnagar, This Cricketer Is A Vikram Fan, Tollywood Cinema Updates

క్రికెట్ తో పాటు పలువురు క్రికెటర్లు అప్పుడప్పుడు వెండి తెరపై కూడా సందడి చేశారు. ఇప్పటికే శ్రీశాంత్, అజయ్ జడేజా వెండి తెరపై మెరవగా.. ఇప్పుడు వారి జాబితాలో ఇర్ఫాన్ పఠాన్ కూడా చేరిపోయాడు. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో స్టార్ హీరో చియాన్ విక్రమ్ 58వ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాలో పఠాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పఠాన్ తన షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ చిత్రంలో టర్కీ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఇర్ఫాన్ విక్రమ్ పై ప్రశంసలు కురిపించాడు. నేను గతంలో రియాలిటీ షోలు చేశాను. కానీ నటన భిన్నమైనది. నటించాలంటే చాలా అనుభవం కావాలి.. అదే విధంగా ఓపిక కూడా ఉండాలి. ఈ చిత్రంలో నాకు విక్రమ్ కి మధ్య కొన్ని సన్నివేశాలు ఉన్నాయి.విక్రమ్ తో కలసి నటించడం నాకు ఓ గొప్ప అనుభవం…విక్రమ్ ని అంతా సౌత్ ఇండియా అమిర్ ఖాన్ అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడు అర్థమైందని ప్రశంసలు కురిపించాడు. మరి చూద్దాం తన స్వింగ్ మాయాజాలంతో బ్యాట్స్ మెన్ ని బోల్తా కొట్టించిన ఇర్ఫాన్ పఠాన్ పోలీస్ ఆఫీసర్ గా ఎలా నటించాడో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − seven =