‘పొన్నియన్‌ సెల్వన్‌’ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

Date Locked For Ponniyar Selvan Movie Launch,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ponniyar Selvan Movie Date Fixed,Ponniyar Selvan Movie Updates,Ponniyar Selvan Movie Latest News

ప్రముఖ నవలారచయిత కల్కీ రాసిన నవల ఆధారంగా మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ అనే సినిమా తీస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వార్తలైతే వచ్చాయి కానీ ఇంత వరకూ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. తమిళ్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడంతో మణిరత్నం కూడా ఈ సినిమాలో నటించే నటీమణులను కూడా అంతే ప్రముఖులను సెలెక్ట్ చేసాడు. యువ స్టార్స్‌ నుంచి సూపర్‌స్టార్స్‌ వరకు పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో భాగం కాబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమా ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ చిత్రం డిసెంబర్ 12వ తేదీన థాయిలాండ్ లో ఈ చిత్రం మొదలుకానుంది.

ఇక ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్, అనుష్క, జయం రవి, విక్రమ్, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, అమలాపాల్, కార్తి, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు లాంటి స్టార్లు నటించనున్నారు. మలయాళ నటుడు జయరాం, నటి అమలాపాల్, ఐశ్వర్యలక్ష్మి కూడా ముఖ్య పాత్రల్లో నటించనున్నట్లు తెలిసింది. మద్రాస్‌ టాకీస్, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థలో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + one =