డిస్ని రూపొందించిన యానిమేషన్ మూవీ ‘ఫ్రోజెన్’ 2013లో విడుదలైన ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటేడ్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సంవత్సరం ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డును గెలుచుకొన్నది.ఇక దీనిలో భాగంగానే ఫ్రొజెన్ 2 ను తీసుకురానున్నారు. ఈ చిత్రం నవంబర్ 22 తేదీన ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగులో వస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే యువరాణి ఎల్సా పాత్రకు ప్రముఖ నటి నిత్యామీనాన్ డబ్బింగ్ చెబుతుంది. ప్రియదర్శి కూడా ఈ సినిమాలో ఐకానిక్ పాత్ర ఐన ఫన్నీ స్నో మ్యాన్ ఒలఫ్ పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నాడు. ఇక ఈ లిస్ట్ లో టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార కూడా చేరిపోయింది. బేబీ ఎల్సా పాత్రకు సితార డబ్బింగ్ చెబుతుంది. మరి ఇప్పటికే సితార యూ ట్యూబ్ లో తన సొంత ఛానెల్ లో పలు వీడియోలతో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు తన సరికొత్త టాలెంట్‌తో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























