మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్’. స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ విశేష ప్రజాదరణ పొందింది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తుందని గతంలోనే టాక్ వచ్చింది. ఇక ఈ వెబ్ సిరీస్ లో సమంత ఏ పాత్రలో నటిస్తుందో తెలిసిపోయింది. ఓ టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటిస్తున్నట్టు తెలుస్తుంది. అంతే కాదు సమంత భారీ స్టంట్స్ చేస్తూ యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించబోతుందట.
కాగా తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్ సిరీస్‌ను దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరు హిందీలో ‘షోర్ ఇన్ ది సిటీ’, ‘గో గోవా గాన్’ సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు తెలుగులో సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘డి ఫర్ దోపిడి’ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే.
మరోవైపు సమంత వరుస సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తుంది. ఈ యేడాది మొదట్లో నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా, రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా ’96’ రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: