వైసీపీ కోసం పని చేసిన సెలెబ్రిటీలకు జగన్ ప్రభుత్వంలో పలు కీలక పదవులు దక్కిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, పృథ్వీ, అలీ, పోసాని కృష్ణమురళి సహా ఈ జాబితాలో చాలా మంది ఉన్నారు. పృథ్వీకి ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పదవి ఇవ్వగా ఈ జాబితాలో సీనియర్ నటుడు విజయ్ చందర్ కూడా చేరిపోయాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈయనకు ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ పదవిని అప్పగించాడు జగన్. వైసీపి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాత అంబిక కృష్ణ ఈ పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత జయసుధ ఈ పదవిలో కూర్చుంటుందనే ఊహాగానాలు వినిపించాయి. అంతేకాదు ఒకానొక సమయంలో అలీని ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమిస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. ఆ పదవి కోసం అలీ గత కొంత కాలంగా కన్నులు కాచేలా ఎదురు చూస్తున్నాడు. ఫైనల్ గా ఇప్పుడు విజయ చందర్‌కు ఆ పదవి దక్కింది. కాగా పలు సినిమాల్లో నటించిన విజయ్ చందర్ కు సాయిబాబా, ఏసుక్రీస్తు పాత్రలతో మంచి గుర్తింపు వచ్చింది. ఇంకా వైసీపీ కోసం పని చేసిన వారిలో మోహన్ బాబు, అలీ, పోసాని, రాజశేఖర్ దంపతులు లాంటి వాళ్లున్నారు. మరి వాళ్లకెప్పుడు పదవులు వరిస్తాయో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: