త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ సామజవరగమనా సాంగ్ షూటింగ్ కోసం యూరప్‌లో వున్నసంగతి కూడా విదితమే. అయితే అక్కడ అల్లు అర్జున్ లిడో డాన్సర్స్‌తో కలిసి స్టెప్పులేసాడట. అంతేకాదు గత 25 సంవత్సరాలుగా ఎంతో ఫేమస్ అయిన లిడో డాన్స్‌ని బన్నీ చేయడంతో తాజాగా ఆయన ఖాతాలో మరో రికార్డ్ నమోదైంది. ఫస్ట్ టైమ్ పారిస్‌లో లిడో డాన్సర్స్‌తో డాన్స్ చేసిన సౌత్ఇండియన్ స్టార్‌గా రికార్డ్ క్రియేట్ చేసాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ ‘సామజవరగమనా’, ‘రాములో రాములా’ పాటలు రిలీజ్ చేయగా వాటికీ ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూ ట్యూబ్ లో ఈ రెండు పాటలు మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా చెప్పేసారు. సంక్రాంతి పండుగా సందర్భంగా జనవరి 12 వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో టబు, నివేద పేతురేజ్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: